డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్

ABN, Publish Date - Jul 19 , 2026 | 08:14 AM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను.. ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్ నివాసానికి శనివారం సాయంత్రం లోకేశ్ వెళ్లారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్ 1/5

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను.. ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్ నివాసానికి శనివారం సాయంత్రం లోకేశ్ వెళ్లారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్ 2/5

పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని లోకేశ్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయ చిత్రపటంతో పాటు ప్రసాదాన్ని పవన్‌కు అందజేశారు. భుజం గాయం, శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితిపై లోకేశ్ ఆరా తీశారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్ 3/5

వైద్యులు సూచించిన విశ్రాంతి, జాగ్రత్తలను తప్పకుండా పాటించాలని సూచించారు. పవన్ త్వరితగతిన పూర్తి ఆరోగ్యంతో ప్రజాసేవలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్ 4/5

పవన్ కల్యాణ్‌కు మంత్రి లోకేశ్ ధైర్యం చెప్పారు. ఈ భేటీ ఆప్యాయ వాతావరణంలో జరిగింది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఇద్దరు నేతల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్ 5/5

పవన్ కల్యాణ్ ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకోగా, పలువురు రాజకీయ ప్రముకులు, అభిమానులు ఆయనను పరామర్శిస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Updated at - Jul 19 , 2026 | 08:17 AM