మంగళగిరిలో ‘మన ఇల్లు-మన లోకేశ్‌’.. పేదలకు రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ

ABN, Publish Date - Jul 22 , 2026 | 07:35 AM

మంగళగిరి నియోజకవర్గంలోని పేద కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేసే లక్ష్యంతో చేపట్టిన ‘మన ఇల్లు-మన లోకేశ్’ కార్యక్రమానికి మంత్రి నారా లోకేశ్ మంగళవారం శ్రీకారం చుట్టారు. రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు.

 మంగళగిరిలో  ‘మన ఇల్లు-మన లోకేశ్‌’.. పేదలకు రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ 1/16

మంగళగిరి నియోజకవర్గంలోని పేద కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేసే లక్ష్యంతో చేపట్టిన ‘మన ఇల్లు-మన లోకేశ్’ కార్యక్రమానికి మంత్రి నారా లోకేశ్ మంగళవారం శ్రీకారం చుట్టారు.

 మంగళగిరిలో  ‘మన ఇల్లు-మన లోకేశ్‌’.. పేదలకు రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ 2/16

రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని లోకేశ్ ఘనంగా ప్రారంభించారు.

 మంగళగిరిలో  ‘మన ఇల్లు-మన లోకేశ్‌’.. పేదలకు రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ 3/16

మంగళగిరి బైపాస్ రోడ్డులోని సీకే కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు కొనసాగనుంది.

 మంగళగిరిలో  ‘మన ఇల్లు-మన లోకేశ్‌’.. పేదలకు రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ 4/16

నియోజకవర్గంలోని అర్హులైన పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలను అందజేసి వారి సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి లోకేశ్ తెలిపారు.

 మంగళగిరిలో  ‘మన ఇల్లు-మన లోకేశ్‌’.. పేదలకు రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ 5/16

పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని లోకేశ్ పేర్కొన్నారు.

 మంగళగిరిలో  ‘మన ఇల్లు-మన లోకేశ్‌’.. పేదలకు రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ 6/16

అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలాలు అందేలా చర్యలు చేపడుతున్నామని లోకేశ్ వెల్లడించారు.

 మంగళగిరిలో  ‘మన ఇల్లు-మన లోకేశ్‌’.. పేదలకు రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ 7/16

‘మన ఇల్లు-మన లోకేశ్’ కార్యక్రమం ద్వారా వేలాది కుటుంబాలు లబ్ధి పొందనున్నాయని లోకేశ్ వెల్లడించారు.

 మంగళగిరిలో  ‘మన ఇల్లు-మన లోకేశ్‌’.. పేదలకు రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ 8/16

కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు, పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

 మంగళగిరిలో  ‘మన ఇల్లు-మన లోకేశ్‌’.. పేదలకు రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ 9/16

ఇళ్ల పట్టాలు అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

 మంగళగిరిలో  ‘మన ఇల్లు-మన లోకేశ్‌’.. పేదలకు రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ 10/16

మంగళగిరి అభివృద్ధి, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా తాము ముందుకెళ్తున్నామని మంత్రి లోకేశ్ ఉద్ఘాటించారు.

 మంగళగిరిలో  ‘మన ఇల్లు-మన లోకేశ్‌’.. పేదలకు రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ 11/16

పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు.

 మంగళగిరిలో  ‘మన ఇల్లు-మన లోకేశ్‌’.. పేదలకు రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ 12/16

రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మంగళగిరి ప్రాంత ప్రజల్లో కొత్త ఆశలు నింపిందని లబ్ధిదారులు అభిప్రాయపడ్డారు.

 మంగళగిరిలో  ‘మన ఇల్లు-మన లోకేశ్‌’.. పేదలకు రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ 13/16

మంగళగిరిని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నది తన ధ్యేయమని లోకేశ్ ఉద్ఘాటించారు.

 మంగళగిరిలో  ‘మన ఇల్లు-మన లోకేశ్‌’.. పేదలకు రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ 14/16

గత ఐదేళ్లలో స్థానికంగా ఎవరిని కలిసినా తమ భూమికి శాశ్వత హక్కు కావాలని తనను అడుగుతూ వచ్చారని మంత్రి లోకేశ్ తెలిపారు. ఒకేసారి అందరి భూములను రెగ్యులరైజ్‌ చేయలేనని, అధికారంలోకి వచ్చాక విడతల వారీగా భూములకు శాశ్వత హక్కు కల్పిస్తానని హామీ ఇచ్చానని పేర్కొన్నారు.

 మంగళగిరిలో  ‘మన ఇల్లు-మన లోకేశ్‌’.. పేదలకు రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ 15/16

ఆ మేరకు పేదలకు బట్టలు పెట్టి మరీ ఇళ్ల పట్టాలను అందజేస్తున్నామని లోకేశ్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధితోపాటు మంగళగిరి అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

 మంగళగిరిలో  ‘మన ఇల్లు-మన లోకేశ్‌’.. పేదలకు రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ 16/16

ఎవ్వరూ ఊహించని విధంగా మంగళగిరి ప్రజలు రాష్ట్రంలోనే టాప్‌-3 మెజార్టీతో తనను గెలిపించారని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

Updated at - Jul 22 , 2026 | 07:47 AM