విజయనగరం జిల్లాలో మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్.. హాజరైన హోం మంత్రి అనిత
ABN, Publish Date - Sep 29 , 2026 | 07:09 AM
విజయనగరం జిల్లాలోని పీటీసీలో శిక్షణ పూర్తిచేసుకున్న 2025-26వ బ్యాచ్‌కు చెందిన 473 మంది మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత.. మహిళా కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా పరేడ్‌ను హోం మంత్రి తిలకించారు.
1/14
విజయనగరం జిల్లాలోని పీటీసీలో శిక్షణ పూర్తిచేసుకున్న 2025-26వ బ్యాచ్‌కు చెందిన 473 మంది మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం సోమవారం అట్టహాసంగా జరిగింది.
2/14
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత.. మహిళా కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా పరేడ్‌ను హోం మంత్రి తిలకించారు.
3/14
శిక్షణలో మెరుగైన ప్రతిభ కనబర్చిన వారికి జ్ఞాపికలను అందజేశారు.
4/14
పీటీసీలో కొత్తగా నిర్మించిన కంప్యూటర్ ల్యాబ్‌ను అనిత ప్రారంభించారు.
5/14
అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లతో ప్రమాణం చేయించారు.
6/14
మహిళా కానిస్టేబుళ్లను ఉద్దేశించి మంత్రి అనిత మాట్లాడారు. పోలీసు శాఖలో కానిస్టేబుళ్లు వెన్నెముకని కొనియాడారు.
7/14
ముఖ్యంగా మహిళలు కానిస్టేబుల్‌గా ఉంటే.. స్టేషన్‌కు భయంతో వచ్చే బాధిత మహిళలకు మరింత ధైర్యంగా ఉంటుందని పేర్కొన్నారు.
8/14
మహిళలు, బాలికల రక్షణ బాధ్యత వీరిపై ఉంటుందని అనిత చెప్పుకొచ్చారు.
9/14
ఏ పని అయినా ధైర్యంగా చేయాలని హోం మంత్రి మార్గనిర్దేశం చేశారు. ప్రజలను రక్షించే బాధ్యతను మీరు తీసుకుంటున్నారని.. నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు.
10/14
పోలీసుల వల్లే ఏపీలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని హోం మంత్రి వెల్లడించారు. దానివల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయని వివరించారు.
11/14
శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడంతో పాటు మానసిక స్థైర్యంతో ముందడుగు వేయాలని శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా కానిస్టేబుళ్లకు హోం మంత్రి అనిత పిలుపునిచ్చారు.
12/14
పోలీస్ ఉద్యోగం ఎంతో బాధ్యతతో కలిగినదని హోం మంత్రి పేర్కొన్నారు. మహిళలు ఒకవైపు యూనిఫామ్‌ను, మరోవైపు కుటుంబాన్ని సమన్వయం చేస్తూ ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఎంతోమంది ఆడపిల్లలకు మీరు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
13/14
ఈ శిక్షణ సమయం మీ జీవితానికి పునాది లాంటిదని ఉద్ఘాటించారు. పోలీస్ స్టేషన్‌కు భయంతో వచ్చే వ్యక్తికి పోలీస్ యూనిఫాం ఓ భరోసా ఇవ్వాలని హోం మంత్రి అనిత సూచించారు.
14/14
నెల్లూరు నుంచి ఈస్ట్ గోదావరి జిల్లాల వరకు ఉన్న వారికి ట్రైనింగ్ ఇచ్చారు. ఈ శిక్షణలో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లకు అవార్డులను హోం మంత్రి అనిత అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, పీటీసీ ప్రిన్సిపాల్ రామచంద్ర రాజు పాల్గొన్నారు.
Updated at - Sep 29 , 2026 | 08:19 AM