గుడివాడలో స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్రలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Jul 19 , 2026 | 08:30 AM

గుడివాడలో స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు శనివారం పాల్గొన్నారు. అమృత్‌ 2.0 AIUDF శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. స్వర్ణ పంచాయతీ ఉద్యోగులకు స్వచ్ఛ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు.

 గుడివాడలో స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్రలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 1/8

గుడివాడలో స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు శనివారం పాల్గొన్నారు. అమృత్‌ 2.0 AIUDF శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. స్వర్ణ పంచాయతీ ఉద్యోగులకు స్వచ్ఛ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు.

 గుడివాడలో స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్రలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 2/8

ప్రతినెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు.

 గుడివాడలో స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్రలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 3/8

సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆరోగ్యం, శుభ్రత కూడా అవసరమని సీఎం వెల్లడించారు. ప్రజలు పూర్తిస్థాయిలో సహకరిస్తేనే స్వచ్ఛతా లక్ష్యం నెరువేరుతుందని చెప్పారు.

 గుడివాడలో స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్రలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 4/8

రోడ్లు ఊడ్చటమే పరిశుభ్రత కాదని సీఎం చంద్రబాబు తెలిపారు. స్వచ్ఛాంధ్ర ఉద్దేశం ఇది కాదని అన్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యం మెరుగుపడేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉద్ఘాటించారు.

 గుడివాడలో స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్రలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 5/8

అర్హులైన వారందరికీ సంక్షేమం, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు సంపద సృష్టిస్తున్నామని సీఎం చెప్పుకొచ్చారు.

 గుడివాడలో స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్రలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 6/8

జగన్ హయాంలో చెత్తాచెదారంతో నింపేసిన ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్ది ‘ఐ లవ్‌ గుడివాడ’ అనే నినాదాలతో బోర్డులు ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు.

 గుడివాడలో స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్రలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 7/8

రెండేళ్లలో రాష్ట్రంలో 40 లక్షల టన్నుల చెత్తను తొలగించామని సీఎం చెప్పారు. తెలుగుజాతి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్నామని అన్నారు. 1994లోనే జన్మభూమి పేరుతో పిలుపునిస్తే రాష్ట్ర ప్రజలతో పాటు విదేశాల్లో ఉన్న ఆంధ్రులు తరలివచ్చి తమ వంతుగా సేవలు అందించారని తెలిపారు.

 గుడివాడలో స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్రలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 8/8

స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 120 పట్టణాల్లో రూ.15,274 కోట్ల వ్యయంతో పనులు చేపడుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. మురుగునీటి శుద్ధికి సీవేజ్‌ ప్లాంట్‌లు, మంచినీటి ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, చెరువుల పునరుద్ధరణ, డ్రెయిన్‌ల నిర్మాణ పనులు ప్రారంభించామని పేర్కొన్నారు.

Updated at - Jul 19 , 2026 | 10:45 AM