నెల్లూరు జిల్లాలో పల్లె పండుగ 3.0 ప్రారంభం.. హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
ABN, Publish Date - Sep 30 , 2026 | 06:51 AM
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలోని రామాపురంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు పాల్గొన్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
1/16
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలోని రామాపురంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభించారు.
2/16
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు పాల్గొన్నారు.
3/16
పల్లె పండుగ 3.0 కింద రూ.11,085 కోట్లతో గ్రామాల్లో అభివృద్ధి పనులు, సీసీ, బీటీ రోడ్లు, మేజిక్ డ్రెయిన్ల నిర్మాణం,.. మినీ గోకులాల నిర్మాణం, 50వేల ఎకరాల్లో తోటల పెంపకం పనులను కూటమి ప్రభుత్వం చేపట్టింది.
4/16
రూ.11,085 కోట్ల నిధుల్లో కేంద్ర ప్రభుత్వం రూ.5,391 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5,694 కోట్ల నిధులను ఖర్చు చేయనుంది.
5/16
ఉదయగిరి నుంచి పల్లెల్లో నవోదయానికి నాంది పలికామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఉదయగిరి నియోజకవర్గం పండ్ల తోటల హబ్‌గా మారుతుందని ఉద్ఘాటించారు.
6/16
ప్రతి గ్రామంలో తాగునీరు, రోడ్లు, డ్రైయిన్లు , వీధిలైట్లు తీసుకువచ్చామని వెల్లడించారు. గ్రామాల్లో పేదరికం తగ్గించేందుకు అనేక చర్యలు చేపట్టామని వివరించారు.
7/16
సూపర్‌సిక్స్ హామీలు ఇచ్చి మాట నిలబెట్టుకున్నామని సీఎం వ్యాఖ్యానించారు. అనేక కష్టాలున్నా పలు పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. తల్లికి వందనం, స్త్రీ శక్తి ద్వారా మహిళలకు అండగా నిలిచామని చెప్పుకొచ్చారు.
8/16
అన్నదాత సుఖీభవ కింద రైతులకు సాయం చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. నేతన్నలు, మత్స్యకారులకు ఆర్థిక సాయం చేస్తున్నామని వివరించారు.
9/16
గత పాలకులు ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీశారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేనాటికి రూ.10 లక్షల కోట్ల అప్పుచూసి తనకే మతిపోయిందని అన్నారు.
10/16
వెంటిలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థకు కేంద్రం సహకారంతో సుపరిపాలన అందుతోందని స్పష్టం చేశారు. తాము రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.
11/16
రెండేళ్లలో రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని సీఎం వివరించారు. కొత్త పాలసీలు తెచ్చామని.. అనేక సంస్కరణలు చేపట్టామని వెల్లడించారు.
12/16
వెలిగొండను తమ హయాంలోనే పూర్తి చేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
13/16
పల్లె పండుగ 3.0 ద్వారా గ్రామాల రూపురేఖలు మారతాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. రెండేళ్లలో పల్లె పండుగ, జల్‌జీవన్ మిషన్ ద్వారా పలు కార్యక్రమాలు చేపట్టామని ప్రస్తావించారు.
14/16
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో పంచాయతీలకు కనీస నిధులు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు అండతో పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేశామని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్లు,.. మినీ గోకులాలు, ఫామ్‌పాండ్స్ నిర్మించామని వెల్లడించారు. మారుమూల తండాలకు కూడా రోడ్లు వేశామని అన్నారు. అమరజీవి జలధార ద్వారా అనేక ప్రాంతాలకు తాగునీరు ఇస్తున్నామని చెప్పారు.
15/16
161 గ్రామీణ నియోజకవర్గాల్లో డొంక రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని అన్నారు. మోదీ సహకారంతో పల్లె పండుగ విజయవంతం చేశామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
16/16
గ్రామ స్వరాజ్యమే దేశ ప్రగతికి పట్టుగొమ్మ అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం వచ్చాక అనేక ఏళ్లపాటు పల్లెలపై దృష్టి పెట్టలేదని అన్నారు. పల్లెల్లో జీవించలేక అనేకమంది వలసలు పోయారని తెలిపారు. రాష్ట్రంలో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని వివరించారు. గాంధీజీ కలలను సాకారం చేసే దిశగా తమ హయాంలో అడుగులు వేస్తున్నామని మాధవ్ పేర్కొన్నారు.
Updated at - Sep 30 , 2026 | 07:16 AM