అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు

ABN, Publish Date - Jan 26 , 2026 | 06:04 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చరిత్రలో నేడు (జనవరి 26, 2026) ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. అమరావతి ప్రాంతంలో అధికారికంగా ఇంత భారీ ఎత్తున గణతంత్ర వేడుకలు జరగడం ఇదే తొలిసారి. అమరావతి గడ్డపై జాతీయ జెండా రెపరెపలాడటం అక్కడ ఉన్న వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు 1/30

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చరిత్రలో నేడు (జనవరి 26, 2026) ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.

అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు 2/30

అమరావతి ప్రాంతంలో అధికారికంగా ఇంత భారీ ఎత్తున గణతంత్ర వేడుకలు జరగడం ఇదే తొలిసారి.

అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు 3/30

అమరావతి గడ్డపై జాతీయ జెండా రెపరెపలాడటం అక్కడ ఉన్న వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు 4/30

రాయపూడి సమీపంలోని 22 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు.

అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు 5/30

రాజధాని నగరం రూపుదిద్దుకుంటున్న తరుణంలో ఈ వేడుకలు జరగడం విశేషం.

అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు 6/30

ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు 7/30

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ - అన్నాలెజినోవా దంపతులు, మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు 8/30

11 దళాల నుంచి గవర్నర్ అబ్దుల్ నజీర్ గౌరవ వందనం స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతిని, సంక్షేమ పథకాలను, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా 22 శకటాలను ప్రదర్శించారు.

అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు 9/30

రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన అమరావతి రైతులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వేడుకలను వీక్షించారు. పరేడ్ అనంతరం ఉదయం 11:30 గంటలకు ఆర్టీజీఎస్‌పై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు 10/30

పాలనలో సాంకేతికత వినియోగంపై సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు 11/30

అనంతరం ఈరోజు సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆతిథ్యం ఇచ్చే ప్రత్యేక కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.

అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు 12/30

ప్రజలకు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.

అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు 13/30

రాజధాని అమరావతిలో తొలిసారి జాతీయ జెండా ఎగురవేస్తున్నామని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. గత కొన్నేళ్లుగా ఏపీ స్పష్టమైన దిశ లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.

అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు 14/30

వైసీపీ ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం ఆగిపోయిందని.. ఆర్థిక విశ్వాసం దెబ్బతిందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలే - ప్రగతికి నిజమైన శిల్పులని అభివర్ణించారు.

అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు 15/30

ఏపీ ప్రజల విశ్వాసం మళ్లీ నిజమవుతోందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తెలిపారు.

అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు 16/30

ఆయా ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వివరించారు. ఏపీలో పలు సంస్థలు తిరిగి బలపడుతున్నాయని వెల్లడించారు.

అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు 17/30

స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంతో ముందుకెళ్తున్నామని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. 2047నాటికి ప్రపంచంతో పోటీ పడే రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పుకొచ్చారు.

అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు 18/30

కాలానుగుణంగా పాలన మారాలి అనేది ఏపీ ప్రభుత్వ సిద్ధాంతమని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తెలిపారు.

అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు 19/30

సాంకేతికతతో క్షణాల్లో పాలన చేరేలా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.

అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు 20/30

ఈ సందర్భంగా సుపరిపాలనకు 10 సూత్రాలను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నిర్దేశించారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలిపారు.

అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు 21/30

సాంకేతికత.. సేవలను వేగవంతంగా, జీవనాన్ని సులభంగా మార్చుతోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ వెల్లడించారు.

అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు 22/30

దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్‌ అమరావతిలో ఏర్పాటు చేశామని గవర్నర్ అబ్దుల్ నజీర్ వివరించారు.

అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు 23/30

స్పేస్ సిటీ ఏర్పాటుతో ఏపీని ఆవిష్కరణల కేంద్రంగా నిలబెడుతున్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పుకొచ్చారు.

అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు 24/30

వాట్సాప్‌లో 119 ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకువచ్చిందని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.

అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు 25/30

డ్రోన్ రాజధానిగా ఏపీ ఎదుగుతోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు.

అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు 26/30

ఓర్వకల్లులో 300 ఎకరాల విస్తీర్ణంలో డ్రోన్ సిటీ నిర్మాణం జరుగుతోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పుకొచ్చారు.

అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు 27/30

పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టిందని గవర్నర్ అబ్దుల్ నజీర్ వెల్లడించారు.

అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు 28/30

అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ప్రజలకు సీఎం రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.

అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు 29/30

ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరూ పునరంకితం కావాలని సీఎం చంద్రబాబు కోరారు.

అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు 30/30

రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును ఘనంగా నిర్వహించుకుందామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను కాపాడాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Updated at - Jan 26 , 2026 | 07:22 PM