Share News

అమెరికాలో సత్తా చాటిన తెలుగమ్మాయి ఇషాన్వి

ABN , Publish Date - Jun 09 , 2026 | 11:40 AM

అమెరికాలో తెలుగు విద్యార్థిని మరోసారి తన ప్రతిభను చాటుకుంది. ఫ్లోరిడాలోని స్టెయిన్‌బ్రెన్నర్ హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న ఇషాన్వి సబ్నివీసు అమెరికా జాతీయ స్థాయి ఆవిష్కరణల పోటీలో ద్వితీయ బహుమతి అందుకుంది.

 అమెరికాలో సత్తా చాటిన తెలుగమ్మాయి ఇషాన్వి
US National Innovation Competition Ishanvi Success

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని ఫ్లోరిడాలోని స్టెయిన్‌బ్రెన్నర్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న తెలుగు విద్యార్థిని ఇషాన్వి సబ్నివీసు అమెరికా జాతీయ స్థాయి ఆవిష్కరణల పోటీలో అద్భుతమైన విజయం సాధించింది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఇన్వెన్షన్ కన్వెన్షన్ యూఎస్ నేషనల్స్’లో 35 రాష్ట్రాల నుంచి పాల్గొన్న 3 లక్షలకుపైగా విద్యార్థులను వెనక్కి నెట్టుకుంటూ ఆమె ద్వితీయ బహుమతి కైవసం చేసుకుంది.

NRI (9).jpg

దృష్టి లోపం ఉన్నవారి స్వతంత్ర, సురక్షిత ప్రయాణం కోసం ఇషాన్వి రూపొందించిన ‘AI-ఎనేబుల్డ్ స్మార్ట్ కేన్ (Smart Cane)’ ఈ ఘనతకు కారణమైంది. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే పేటెంట్ దరఖాస్తు దశలో ఉంది. ఆమె ప్రయాణం యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో జరిగిన ప్రాంతీయ పోటీలతో ప్రారంభమై, జాతీయ స్థాయిలో మెరిసింది.


స్మార్ట్ కేన్ ప్రత్యేకతలేంటి?

ఈ వినూత్నమైన స్మార్ట్ కేన్ పూర్తిగా AI సాంకేతికత ఆధారంగా అభివృద్ధి చేశారు. ఇందులోని ముఖ్యమైన అంశాలు..

  • రియల్ టైమ్ AI ఆధారిత వాతావరణ విశ్లేషణ వ్యవస్థ

  • ఆన్-డివైస్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs) ద్వారా ప్రాసెసింగ్

  • బ్లూటూత్ ఇయర్ పీస్ ద్వారా వాయిస్ మార్గనిర్దేశం

  • ఇంటర్నెట్ అవసరం లేని ఆఫ్లైన్ సామర్థ్యం

  • అడ్డంకులను ముందస్తుగా గుర్తించే (Obstacle Detection) వ్యవస్థ

  • తప్పుడు గుర్తింపులను తగ్గించే ఫాల్స్ డిటెక్షన్ సప్రెషన్ టెక్నాలజీ

  • ఒకే టచ్‌తో అత్యవసర కాల్స్ చేసే ఎమర్జెన్సీ ఫీచర్

గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో కూడా ఇది సమర్థవంతంగా ఉపయోగపడేలా రూపొందించారు. అంతేకాకుండా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి మద్దతుగా ‘క్రానిక్ కనెక్ట్’ అనే నాన్-ప్రాఫిట్ కమ్యూనిటీని కూడా ఆమె స్థాపించారు.

NRI (6).jpg


స్ఫూర్తిగా ఇషాన్వి విజయం

ఈ సందర్భంగా ఇషాన్వి మాట్లాడుతూ.. 'ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సమాజానికి గర్వకారణం' అని తెలిపింది. ఆమె విజయంపై ప్రవాస తెలుగువారు ఆనందం వ్యక్తం చేస్తూ.. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్ట్ విజయంలో హైదరాబాద్‌కు చెందిన టెక్నాలజీ స్టార్టప్ క్వాడ్రిక్ ఐటీ కీలకపాత్ర పోషించింది. ఈ సంస్థ యువ ఆవిష్కర్తలకు AI, టెక్నాలజీ మార్గదర్శకత్వం, సాంకేతిక సహాయం, మెంటారింగ్ అందిస్తూ ఆలోచనలను వాస్తవ పరిష్కారాలుగా మార్చడంలో సహాయపడుతోంది. కృత్రిమ మేధస్సు, ఇంజనీరింగ్ రంగాల్లో యువత పెరుగుతున్న భాగస్వామ్యానికి ఈ విజయం నిదర్శనంగా నిలిచింది.


Also Read:

పాస్‌పోర్టు ఆఫీసర్ వైఎస్‌వీఎస్‌ఆర్ కృష్ణకు ఎన్నారైల ఆత్మీయ వీడ్కోలు

న్యూజెర్సీలో తానా CPR & AED శిక్షణ కార్యక్రమం

Updated Date - Jun 09 , 2026 | 11:45 AM