Share News

తానా మిడ్ అట్లాంటిక్ విల్ అండ్ ట్రస్ట్ విజయవంతం

ABN , Publish Date - May 05 , 2026 | 08:28 AM

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ టీమ్ తాజాగా నిర్వహించిన విల్ అండ్ ట్రస్ట్ కార్యక్రమానికి అద్భుత స్పందన వచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా కుటుంబానికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని తానా మిడ్ అట్లాంటిక్ టీమ్ నిర్వహించింది.

తానా మిడ్ అట్లాంటిక్ విల్ అండ్ ట్రస్ట్ విజయవంతం
TANA Telugu Association

ఇంటర్నెట్ డెస్క్, మే5 (ఆంధ్రజ్యోతి): ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ టీమ్ తాజాగా నిర్వహించిన విల్ అండ్ ట్రస్ట్ కార్యక్రమానికి అద్భుత స్పందన వచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా కుటుంబానికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని తానా మిడ్ అట్లాంటిక్ టీమ్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. దాదాపు వందమందికిపైగా కుటుంబాలు తమ విల్ అండ్ ట్రస్ట్ పత్రాలను తమ భవిష్యత్తుకు భద్రత కల్పించడంతో పాటు తమ సంతతి వారికి ఉపయోగపడేలా చేసుకున్నాయి.

tana.jpg


ఎస్టేట్ ప్లానింగ్ ప్రాముఖ్యంపై కూడా ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. విల్ ట్రస్ట్ వంటి ముఖ్యమైన పత్రాలను కలిగి ఉండటం ఎంత ముఖ్యమో ఈ కార్యక్రమం ద్వారా చాలామందికి తెలిసింది. ఈ కార్యక్రమం ద్వారా పలు సేవలను తానా టీమ్ అందించింది. నిపుణుల సలహాలు, ఉచిత నోటరీ సేవలు, ఉచిత డాక్యుమెంట్ ప్రింటింగ్, ఇతరత్రా సేవలను అందజేసింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి తమ మార్గదర్శకత్వాన్ని, నిరంతర సహకారాన్ని అందించిన తానా నాయకత్వ బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

tana-2.jpg


తానా ప్రెసిడెంట్ డాక్టర్ నరేన్ కొడాలి, తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి, మిడ్-అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, తానా బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని తదితరులు ఈ కార్యక్రమ విజయవంతానికి సహకరించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన చుగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఓస్టన్, తనిష్క్ యుఎస్‌ఏ, స్ప్రింగ్ ఈగిల్స్ సంస్థలకు ఇతరులకు తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ ధన్యవాదాలు తెలిపారు.

tana-1.jpg

Updated Date - May 05 , 2026 | 08:43 AM