తానా కోశాధికారి రాజా కసుకుర్తి ఆధ్వర్యంలో గ్రామాలకు నీటి ట్యాంకర్ల సహయం
ABN , Publish Date - May 18 , 2026 | 11:42 AM
బాపులపాడు మండలంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తానా కోశాధికారి, ప్రముఖ ఎన్నారై రాజా కసుకుర్తి నిరంతరాయంగా అందిస్తున్న సేవలు అభినందనీయమని గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ వెల్లడించారు.
బాపులపాడు మండలంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తానా కోశాధికారి, ప్రముఖ ఎన్నారై రాజా కసుకుర్తి నిరంతరాయంగా అందిస్తున్న సేవలు అభినందనీయమని గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ వెల్లడించారు. ఈ వాటర్ ట్యాంకర్లను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ ప్రారంభించారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజల తాగు నీటి అవసరాలను తీర్చడంలో రాజా కసుకుర్తి కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు గ్రామీణ ప్రజల కోసం ఆయన మూడు వాటర్ ట్యాంకర్లు అందజేశారని వివరించారు. భవిష్యత్తులో కూడా ఆయన ఇదే విధంగా సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ వెంకట్రావ్ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించిన కలపాల శ్రీధర్ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధిలో రాజా కసుకుర్తి ఎప్పుడూ ముందుంటారని చెప్పారు. ఆయన సహకారం వల్లే ఈ కార్యక్రమం విజయవంతమైందన్నారు. గ్రామాల్లో ముఖ్యంగా వేసవిలో తాగు నీటి సమస్యలు తీవ్రంగా ఉంటాయని.. వాటిని నివారించేందుకు ఈ ట్యాంకర్లు తమకు ఎంతగానో ఉపయోగపడతాయని గ్రామస్తులు తెలిపారు.


తాగు నీటి సరఫరా కోసమే కాకుండా.. రోజువారీ అవసరాల్లో కూడా ఇవి కీలకంగా మారతాయని గ్రామస్తులు ఆశా భావం వ్యక్తం చేశారు. పూజాతో ప్రారంభమైన ఈ కార్యక్రమం.. భక్తితోపాటు సేవా భావంతో నిండిన వాతావరణంలో జరిగింది. గ్రామస్తులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం ఎన్నారై రాజా కసుకుర్తి అందిస్తున్న సేవలపై గ్రామస్తులు ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత ఆయనకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంత అభివృద్ధికి ఒక మంచి ఆదర్శంగా నిలుస్తుందని స్థానికులు విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..
కువైత్‌లో అట్టహాసంగా తెలుగుదేశం మహానాడు
దుబాయిలో వైభవంగా తెలుగుదేశం మినీ మహానాడు
For More NRI News And Telugu News