దుబాయిలో వైభవంగా తెలుగుదేశం మినీ మహానాడు
ABN , Publish Date - May 17 , 2026 | 04:54 PM
దుబాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మినీ మహానాడు వేడుకను వైభవంగా జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ దుబాయి అధ్యక్షుడు యం. విశ్వేశ్వర రావు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా పెనమలూరు శాసన సభ్యులు బోడె ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ప్రవాసాంధ్రులు ఎక్కువగా నివసిస్తున్న అరేబియా దేశాల్లో తెలుగుదేశం పార్టీ అభిమానులు మహానాడును ఉత్సాహభరితంగా నిర్వహిస్తున్నారు. తాజాగా దుబాయిలోనూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మినీ మహానాడు వేడుకను జరుపుకున్నారు.
తెలుగుదేశం పార్టీ దుబాయి అధ్యక్షుడు యం. విశ్వేశ్వర రావు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా పెనమలూరు శాసన సభ్యులు బోడె ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి బలమైన పునాదులుగా ఉన్న ప్రవాసాంధ్రులు మౌనంగా పార్టీకి చేస్తున్న సేవలను కొనియడారు. విజయవాడకు అంతర్జాతీయ విమాన సేవలను రావాలనేది ప్రవాసాంధ్రుల చిరకాల కోరిక అని అన్నారు. ఈ దిశగా తన వంతుగా క్రియాశీలక పాత్ర వహిస్తానని ఆయన హామీనిచ్చారు.

నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు, యువనేత లోకెశ్‌ల పాత్రను పార్టీ నాయకులు ప్రశంసించారు.
దుబాయి, యుఏఈలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల గురించి విశ్వేశ్వర రావు వివరించారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్ధితుల కారణంగా మినీ మహానాడును లాంఛనంగా ఎలాంటి ఆర్భాటం లేకుండా నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.
దుబాయిలోని పార్టీ ప్రముఖులు ముక్కు తులసి కుమార్, వి.రాజా రవి, డి.ప్రసాద్, వి.రాజేశ్, యస్.సాహుల్, పి.రాజు, బి.సునీల్, టి.మధుసూధన్, బి.సురేంద్ర, ఖాదర్ బాషా, మోహన్ మురళి, యం.రాధాకృష్ణా తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
యూఎస్ఏలో గ్రేట్ ఇండియన్ ఫుడ్, షాపింగ్ ఫెస్ట్ అండ్ మ్యాంగో ఫెస్టివల్
తెలుగుదేశం మహానాడు.. దద్దరిల్లిన దమ్మాం