ఘనంగా ఆస్టిన్ పాఠశాల ఆరవ వార్షికోత్సవ వేడుకలు
ABN , Publish Date - Apr 29 , 2026 | 05:01 PM
ఆస్టిన్ పాఠశాలలో ఆరవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తానా పాఠశాల విద్యార్థులు బాల రామాయణం నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. ఈ నాటకంలో వివిధ పాత్రలు పోషించిన చిన్నారులు తెలుగు సంభాషణలు అందరిని ఆకట్టుకున్నాయి.
ఆస్టిన్: ఆస్టిన్ పాఠశాలలో ఆరవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తానా పాఠశాల విద్యార్థులు బాల రామాయణం నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. ఈ నాటకంలో వివిధ పాత్రలు పోషించిన చిన్నారులు తెలుగు సంభాషణలు అందరిని ఆకట్టుకున్నాయి. పిల్లల అద్భుతమైన నటనకు అందరూ మంత్రముగ్ధులయ్యారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా నగర మేయర్ జిమ్ విచ్చేశారు.

పిల్లలు, ఉపాధ్యాయులను ఈ సంద్భంగా ఆయన అభినందించారు. విశ్వ గురుకులం అంకురం పాఠ్యపుస్తకాన్ని వ్యవస్థాపక సభ్యుడు రామ్ మారం విడుదల చేశారు. పిల్లలకు పాఠశాల, విశ్వ గురుకులం విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమానికి ఆస్టిన్ పాఠశాల పూర్వ విద్యార్థులు నిహారిక భమిడిపాటి, రితిక గంగబత్తిన వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అలాగే ఈ ఏడాది విద్యార్థులకు పాఠశాల పూర్వ విద్యార్థులు ద్విజేష్ గొంట్ల, సమయ సిద్ధాంత పొట్లచెరువు పాఠాలను బోధించారు.

పాఠశాల కో-చైర్మన్ రజని మారం, ఉపాధ్యాయులు అనూష చిట్టూరి, ప్రత్యూష అట్లూరి, శ్వేత వెలగలేటి, రాజేష్ గంగబత్తిన, శ్రీదేవి కోట, మృదుల కొనంకి, వాసవి కల్వ, విశ్వ గురుకులం ఉపాధ్యాయులు వంశీ భరద్వాజ్, తానా చైర్మన్ నాగేంద్ర శ్రీనివాస్‌లను తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి అభినందించారు. శ్రీనివాస్ లావు, శ్రీనివాస్ ఓరుగంటి, రాజా కసుకుర్తి, ఠాగూర్ మల్లినేనికి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..
డల్లాస్‌లో ATA ఫండ్‌రైజర్ కార్యక్రమం ఘన విజయం
పెరిగిన విమాన టికెట్ల ధరలు! అత్యధిక ధర చెల్లిస్తున్న రాయలసీమ వాసులు
For More NRI News And Telugu News