సాంబ్రాణి ధూపం ఎందుకు వెయ్యాలి?
ABN , Publish Date - Nov 27 , 2026 | 02:08 AM
సాంబ్రాణి చాలా శక్తిమంతమైన పదార్థం. ఏదైనా శుభకార్యం చెయ్యాలనుకున్నప్పుడు, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు... సాంబ్రాణి వేస్తారు. కుటుంబంలో...
తెలుసుకుందాం
సాంబ్రాణి చాలా శక్తిమంతమైన పదార్థం. ఏదైనా శుభకార్యం చెయ్యాలనుకున్నప్పుడు, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు... సాంబ్రాణి వేస్తారు. కుటుంబంలో మరణం సంభవించినట్టయితే... పన్నెండు రోజుల వరకూ సాంబ్రాణిఽ వేస్తారు. ఎందుకంటే... గాలిని పూర్తిగా శుద్ధి చెయ్యడానికి. గాలిలోనూ, ఇతర ఉపరితలాల మీదా ఉన్న కొన్ని రకాల బ్యాక్టీరియాను కూడా సాంబ్రాణి చంపుతుందని పరిశోధకులు కనుగొన్నారు.
సాంబ్రాణి అనేది ఒక చెట్టు నుంచి చుక్కలుగా కారుతూ ఉండే ప్రత్యేకమైన జిగురు పదార్థం. సాంబ్రాణి కోసం లోపలి వరకూ లోతుగా చెక్కిన భారీ చెట్లను అడవుల్లో చూడవచ్చు. చెట్లు బయటకు దృఢంగా కనిపిస్తాయి. కానీ లోపల ఈ జిగురు కారడం కోసం ఒక గుల్ల ఉంటుంది. ఈ జిగురు చాలా తక్కువగా లభించే విలువైన పదార్థం. దాన్ని ఎక్కువ మొత్తంలో సేకరించాలంటే చాలామైళ్ళ దూరం నడవాలి. కారణమేమిటంటే... ఆ చెట్లు పరిపక్వమైనవై ఉండాలి. అంటే వాటి వయసు కనీసం ముప్పై నుంచి యాభై సంవత్సరాలు ఉండాలి. లేకపోతే జిగురు రాదు. వాతావరణం మీద సాంబ్రాణి గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. అది కేవలం సువాసన ఇచ్చేది మాత్రమే కాదు. గాలిని శుద్ధి చేస్తుంది. వాతావరణాన్ని సజీవంగా ఉంచుతుంది. ఇంట్లో తేలికపాటి సాంబ్రాణి ధూపం వేసినట్టయితే... ఇంట్లో ఉన్నప్పటికీ ఆరుబయట ఆహ్లాదమైన ప్రదేశంలో ఉన్నట్టు అనిపిస్తుంది.
ధూప ద్రవ్యాలను సరైన పద్ధతిలో ఉపయోగించాలి. కానీ ఈ రోజుల్లో రసాయన పదార్థాలతో ధూపాలను తయారు చేస్తున్నారు. వీధుల్లో, పరిశ్రమల్లో, పనులు చేసే కర్మాగారాల్లో కావలసినన్ని రసాయనాలు ఉన్నాయి. కనీసం ఇంట్లోనైనా రసాయనాలతో తయారైన ధూపం వెయ్యకుండా ఉండాలి. ఈ రోజు బజారులో అందుబాటులో ఉన్నవాటిలో చాలావరకూ రసాయనాలతో తయారైనవే. మూసి ఉన్న గదుల్లో రసాయనాలను కాలిస్తే... వాటి దుష్ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ధూపాన్ని వెలిగించే ముందు తప్పకుండా తనిఖీ చెయ్యాలి. అది సహజమైన జిగురు లేదా కొన్ని రకాల నూనెలు, పదార్థాలతో తయారు కావాలి. ఈ వ్యత్యాసాన్ని గుర్తించడం ఎంతో అవసరం. సహజసిద్ధమైన పదార్థాలతో తయారైన ధూపం ఆధ్యాత్మికంగానే కాదు, ఆరోగ్యపరంగానూ ప్రయోజనం చేకూరుస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్
యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News