పిల్లలు సరిగా చదవట్లేదా..?
ABN , Publish Date - Sep 07 , 2026 | 01:22 AM
పిల్లలు పుస్తకం తెరవగానే ఆకలి, నిద్ర, బాత్‌రూమ్ అంటూ చదువు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేయడం గమనిస్తుంటాం. అలాంటప్పుడు పిల్లలను కోప్పడకుండా వారికి చదువుపై ఆసక్తి కలిగేలా తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం...
పిల్లలు పుస్తకం తెరవగానే ఆకలి, నిద్ర, బాత్‌రూమ్ అంటూ చదువు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేయడం గమనిస్తుంటాం. అలాంటప్పుడు పిల్లలను కోప్పడకుండా వారికి చదువుపై ఆసక్తి కలిగేలా తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం...
వయసును బట్టి పిల్లల ఏకాగ్రత మారుతుంటుంది. అయిదేళ్ల పిల్లలు పది నిమిషాలకు మించి ఏ అంశం మీద దృష్టి నిలపలేరు. అదే పదేళ్ల పిల్లలు అరగంట వరకు ఏకాగ్రతతో ఉండగలరు. కాబట్టి పిల్లల వయసును దృష్టిలో ఉంచుకుని మధ్య మధ్యలో విరామాలు ఇస్తూ చదివిస్తే ప్రయోజనం ఉంటుంది.
వయసుకు తగ్గట్టు నిద్ర లేకపోయినా అలసట, చికాకు పెరిగి పిల్లలు సరిగా చదవలేరు. చిన్న పిల్లలయితే రోజుకు పది గంటలు, పదేళ్లు నిండిన పిల్లలయితే కనీసం ఎనిమిది గంటలు నిద్రించేలా చూడాలి. పడుకునేముందు మొబైల్, టీవీ చూడనివ్వకూడదు. రోజూ ఒకే సమయానికి పడుకోవడం అలాగే లేవడం అలవాటు చేయాలి.
చిన్న పిల్లలకు పజిల్స్, కథలు, బొమ్మలు, మెదడుకు పనిచెప్పే ఆటల రూపంలో వివరిస్తే వారికి చదువంటే ఇష్టం కలుగుతుంది.
ఒకేసారి కాకుండా పాఠాన్ని చిన్న భాగాలుగా విభజించుకుని చదవడాన్ని పిల్లలకు నేర్పించాలి. ఒక్కో భాగం పూర్తికాగానే చిన్న విరామం తీసుకుంటూ నీళ్లు తాగడం, స్నాక్స్ తినడం, వాకింగ్ లాంటివి అలవాటు చేయాలి. దీనివల్ల క్రమంగా పిల్లలకు చదువుపై ఆసక్తి, ఏకాగ్రత పెరుగుతాయి.
పిల్లలకు రోజూ తాజా పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, పాలు, గుడ్లు లాంటి పోషకాహారాన్ని అందించాలి. అప్పుడే మెదడు చురుకుదనం పెరిగి పిల్లలు రోజంతా ఉత్సాహంగా ఉండడమే కాకుండా చదువులో కూడా రాణిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పారా అథ్లెట్... ట్రాక్‌లో హిట్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News