Share News

మనసు చేసే మార్గ నిర్దేశం

ABN , Publish Date - Mar 13 , 2026 | 01:30 AM

ప్రపంచం సాంకేతికంగాను, మానవ విలువల పరంగాను వేగంగా మార్పు చెందుతోందని మనకు తెలుసు. సాంకేతికత మానవాళిని మునుపెన్నడూ లేనంత ఎత్తుకు తీసుకువెళుతోందని మనలో చాలామంది...

మనసు చేసే మార్గ నిర్దేశం

యోగా

ప్రపంచం సాంకేతికంగాను, మానవ విలువల పరంగాను వేగంగా మార్పు చెందుతోందని మనకు తెలుసు. సాంకేతికత మానవాళిని మునుపెన్నడూ లేనంత ఎత్తుకు తీసుకువెళుతోందని మనలో చాలామంది భావిస్తూ ఉంటాం. కానీ అదే సమయంలో విలువల పతనం పట్ల వ్యక్తమయ్యే ఆందోళనకు కూడా సాక్షులుగా ఉంటున్నాం. ఒక కార్డియాలజిస్ట్‌గా, నేను కాలంలో ఒక కీలకమైన దశలో ఉన్నాను. ఒక వైపు, నేను నిరంతరం నేర్చుకోవాల్సిన, వాటికి అనుగుణంగా మారాల్సిన సాంకేతికతలు పుట్టగొడుగుల్లా పెరుగుతున్నాయి. మరోవైపు, వృత్తిపరమైన ఆచరణలో నైతిక సరిహద్దులు అస్పష్టంగా మారుతున్నాయి. ‘సైన్స్‌ రంగంలో మనం ముందంజ వేస్తూ, అదే సమయంలో నైతిక సరిహద్దుల్లో ఎలా ఉండగలం?’ అని ఈ పరిస్థితి నన్ను ప్రశ్నించుకొనేలా చేసింది.

పరిణామాల భయం

ఒక రోగి అనారోగ్యంతో నన్ను సంప్రతించినప్పుడు, నేను క్లినికల్‌ డేటాను విశ్లేషించి, శాస్త్రీయ ఆధారాల సహాయంతో పరిష్కారాన్ని కనుగొంటాను, వ్యక్తిగత అనుభవం ద్వారా మార్గనిర్దేశం పొందుతాను, అంతర్‌ దృష్టి ద్వారా పరిపూర్ణం అవుతాను. ఈ ప్రక్రియలో ఏర్పడే నిఇఢ్న ‘పవిత్రమైన మానసిక అక్షం (ఇరుసు)’గా నేను పిలుచుకుంటాను వైద్యుడు వైద్యపరమైన నిర్ధారణలు చేసేటప్పుడు ఆ కక్ష్యలోనే స్థిరంగా నిలిచి ఉండాలి. కానీ మన మనసులు బాహ్యమైన, అంతర్గతమైన అనేక అంశాలతో ప్రభావితం అవుతాయి. ఉదాహరణకు, రోగి ఒక రాజకీయ నాయకుడు లేదా పోలీసు ఉన్నతాధికారి లాంటి ఉన్నత స్థాయి వ్యక్తి అయినప్పుడు... రాబోయే పరిణామాల పట్ల వైద్యునికి భయం ఉండొచ్చు. ఆర్థికమైన పరిగణనలు, ఫలితాలు, అంచనాలకు సంబంధించిన ఒత్తిళ్ళు, మన స్వభావంలో అహం, నిరాశ, సూక్ష్మస్థాయిలో దురాశ కూడా ఉండవచ్చు. ఇవన్నీ అంతిమమైన వైద్య నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. మనసు ఇటువంటి ప్రభావాల వల్ల అల్లకల్లోలంగా ఉన్నప్పుడు... మనం ఇచ్చే తీర్పు, ఆ స్వచ్ఛమైన మానసిక అక్షం నుంచి ఉత్పన్నం అయ్యే తీర్పు... రెండు ఒకేలా ఉండకపోవచ్చు.


ఏకాగ్రతకోసం మొదలుపెట్టి...

మనసు చేసే ఈ మార్గ నిర్దేశం వైద్యులకు మాత్రమే కాదు... ఇంజనీర్లు, రాజకీయ నాయకులు, మేనేజిమెంట్‌ లీడర్ప్‌, మార్కెట్‌ నిపుణులు, ఇంకా అనేక ఇతర రంగాల నిపుణులకు కూడా ఎంతో ముఖ్యమైనది. ఆ పాత్రలు పోషిస్తున్న నిపుణులు అంతర్గతమైన స్పష్టత, నైతికమైన సంయమనం లేకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో సులభంగానే ఊహించవచ్చు. మరి ఈ చిక్కు ప్రశ్నను ఎదుర్కోవడానికి, వైద్యునిగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు స్పష్టతతో కొనసాగడానికి నాకు సాయపడింది ఏమిటి? నేను వైద్య విద్యార్థిగా ఉన్నప్పుడే షాజహాన్‌పూర్‌కు చెందిన రామ్‌చంద్ర స్థాపించిన ‘హార్ట్‌ఫుల్‌నెస్‌’ ధ్యానాన్ని అభ్యసించడం ప్రారంభించాను. ఆ సమయంలో ఆధ్యాత్మికత గురించి, క్లినికల్‌ ప్రాక్టీస్‌ మీద దాని ప్రభావం గురించి నాకు లోతైన అవగాహన ఏమాత్రం లేదు. కేవలం ఏకాగ్రతను మెరుగుపరుచుకోవడానికే దాన్ని మొదలుపెట్టాను. కాలక్రమేణా, స్థిమితంగా లేని నా మనస్సుకు ఆ అభ్యాసాలు ఒక సమయంలో కేవలం ఒకే విషయం మీద దృష్టిని పెట్టేలా నెమ్మదిగా, స్థిరంగా శిక్షణ ఇచ్చాయి. నా విద్య, శిక్షణ సమయంలో వైద్య శాస్త్రం లోతుల్ని అన్వేషిస్తున్న దశలోనే ఈ అంతర్గత క్రమశిక్షణ కూడా అభివృద్ధి చెందింది.

‘మంచి’ పెరగాలంటే...

ఒకటిన్నర దశాబ్దానికి పైగా కార్డియాలజీని ప్రాక్టీస్‌ చేసిన తర్వాత... సైన్స్‌లో పురోగతులు మనకు శక్తిని ఇస్తాయని ఇప్పుడు నేను నమ్మకంగా చెప్పగలను, కానీ మార్గనిర్దేశం పొందిన మనస్సు మాత్రమే ఆ సాధికారతను మానవీయమైన ఉదారతగా విస్తృత స్థాయిలోకి మార్చగలదు. వైద్య శాస్త్రంలోని నిష్కళంకమైన జ్ఞానం మమ్మల్ని వైద్యులుగా చేస్తుంది. కానీ ‘మంచి వైద్యుడు’ అనే మాటలోని ‘మంచి’ అనేది ‘హార్ట్‌ఫుల్‌నెస్‌’ ధ్యానం లాంటి అంతర్గత అభ్యాసాల ద్వారా పెంపొందుతుంది. అది అంతర్గతంగా నైతిక దిక్సూచిని నిర్మించుకోవడానికి సాయపడుతుంది.

మనసు చేసే మార్గ నిర్దేశం వైద్యులకు మాత్రమే కాదు... ఇంజనీర్లు, రాజకీయ నాయకులు, మేనేజిమెంట్‌ లీడర్ప్‌, మార్కెట్‌ నిపుణులు, ఇంకా అనేక ఇతర రంగాల నిపుణులకు కూడా ఎంతో ముఖ్యమైనది. ఆ పాత్రలు పోషిస్తున్న నిపుణులు అంతర్గతమైన స్పష్టత, నైతికమైన సంయమనం లేకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో సులభంగానే ఊహించవచ్చు

డాక్టర్‌ శరత్‌రెడ్డి, కార్డియాలజిస్ట్‌,

నర్‌, హార్ట్‌ఫుల్‌నెస్‌. 9440087532

ఈ వార్తలు కూడా చదవండి..

స్వదేశీ రక్షణ తయారీకి సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్‌ ఊతం: మంత్రి నారాయణ

మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం చర్యలు

జగన్ హయాంలో పెట్టుబడిదారులను వేధించారు.. సీఎం చంద్రబాబు ధ్వజం

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 13 , 2026 | 01:30 AM