Share News

వాషింగ్‌ మెషిన్‌తో ఇలా...

ABN , Publish Date - Aug 31 , 2026 | 12:48 AM

డ్రెస్‌లు, తువాళ్లు, బెడ్‌షీట్స్‌, పిల్లో కవర్స్‌, కర్టెన్స్‌ తదితరాలను వాషింగ్‌ మెషిన్‌లో వేసి శుభ్రం చేస్తుంటాం. దీనిలో ఉండే స్పెషల్‌ ఫీచర్స్‌ సహాయంతో...

వాషింగ్‌ మెషిన్‌తో ఇలా...

డ్రెస్‌లు, తువాళ్లు, బెడ్‌షీట్స్‌, పిల్లో కవర్స్‌, కర్టెన్స్‌ తదితరాలను వాషింగ్‌ మెషిన్‌లో వేసి శుభ్రం చేస్తుంటాం. దీనిలో ఉండే స్పెషల్‌ ఫీచర్స్‌ సహాయంతో పనిని మరింత త్వరగా పూర్తిచేయవచ్చు. వాటి వివరాలు...

  • క్యాజువల్‌ వేర్‌, ఆఫీస్‌ వేర్‌, ఫార్మల్‌ వేర్‌ డ్రెస్‌లను ఉతికేటప్పుడు యాంటీ రింకిల్‌ మోడ్‌ను ఉపయోగిస్తే స్పిన్‌ వేగం తగ్గుతుంది. దీంతో డ్రెస్‌లపై ముడతలు పడవు. ఇస్త్రీ చేయడం త్వరగా పూర్తవుతుంది.

  • సాధారణంగా వాషింగ్‌ మెషిన్‌ పని పూర్తికావడానికి గంటకు పైగా సమయం పడుతుంది. అంత సమయం కేటాయించలేనప్పుడు, బిజీగా ఉన్న రోజుల్లో క్విక్‌ వాష్‌ మోడ్‌ను ఎంచుకోవడం మంచిది. దీనివల్ల అరగంటలో పని పూర్తయిపోతుంది. అంతగా మురికి పట్టని డ్రెస్‌లు, ఒక్కసారి మాత్రమే వేసుకున్నవి, వర్షంలో తడిసినవి, తేలికగా ఉండే నైట్‌ డ్రెస్‌లను ఈ మోడ్‌లో వాష్‌ చేయవచ్చు. బాగా మురికిగా ఉన్న వాటికి ఈ మోడ్‌ సరిపోదు.

  • డ్రెస్‌లపై బురద, కాఫీ, టీ, సాస్‌, ఇతర ఆహార పదార్థాల మరకలు పడినప్పుడు వాటిని చేత్తో ఉతకకుండా వాషింగ్‌ మెషిన్‌లో వేసి ప్రీ వాష్‌ లేదా ఆటోమేటిక్‌ సోకింగ్‌ మోడ్‌ను సెట్‌ చేయాలి. అప్పుడు వాషింగ్‌మెషిన్‌.. పావు గంట నుంచి అరగంటసేపు దుస్తులను డిటర్జెంట్‌ నీటిలో నానబెట్టి ఆపైన ఉతికేస్తుంది. దీంతో మరకలన్నీ సులువుగా వదిలిపోతాయి.

  • మందంగా ఉండే దుప్పట్లు, సోఫా కవర్లు, కర్టెన్లలాంటి వాటిని వేడి ద్వారా కాకుండా గాలికి ఆరబెట్టేందుకు ఎయిర్‌ డ్రై మోడ్‌ను సెట్‌ చేయాలి. పావుగంటలో.. వాటిలో ఉండే తేమ చాలావరకు తగ్గుతుంది. తరువాత కొద్దిసేపు ఎండలో ఆరేసి ఆపైన మడతపెట్టేసుకోవచ్చు.

  • వాషింగ్‌ మెషిన్‌లో తరచూ డిటర్జెంట్‌, మురికి పేరుకుపోతూ ఉంటాయి. అలాంటప్పుడు డ్రమ్‌ క్లీనింగ్‌ మోడ్‌ను ఆన్‌ చేస్తే డ్రమ్‌, పైపులు పూర్తిగా శుభ్రపడతాయి. ఇలా నెలకోసారి క్లీన్‌ చేస్తుంటే వాషింగ్‌ మెషిన్‌ పనితీరు మెరుగ్గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి..

సంజీవని గేమ్ చేంజర్‌గా మారుతుంది: సీఎం చంద్రబాబు

ఉద్యోగులను రెచ్చగొట్టేలా బొప్పరాజు వ్యవహరిస్తున్నారు: మంత్రి అనగాని

తెలుగు భాషకు గిడుగు రామమూర్తి చేసిన కృషి మరువలేనిది: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 31 , 2026 | 12:48 AM