Share News

శాంతి మార్గదర్శి

ABN , Publish Date - Mar 20 , 2026 | 01:26 AM

మానవతావాదం, ఆధ్యాత్మిక వ్యక్తిత్వం, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మూర్తీభవించిన ఆదర్శ మహిళ శ్రీమాతాజీ నిర్మలాదేవి. సామాజిక పరివర్తన కోసం, శాంతికోసం అహర్నిశలు శ్రమించిన...

శాంతి మార్గదర్శి

సహజయోగ

మానవతావాదం, ఆధ్యాత్మిక వ్యక్తిత్వం, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మూర్తీభవించిన ఆదర్శ మహిళ శ్రీమాతాజీ నిర్మలాదేవి. సామాజిక పరివర్తన కోసం, శాంతికోసం అహర్నిశలు శ్రమించిన నిస్వార్థ సేవకురాలు. సహజయోగ ద్వారా లక్షలాది మందికి ధ్యాన మార్గాన్ని ఆమె చూపించారు. శారీరక ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు దోహదం చేశారు.

స్వాతంత్య్ర సమరయోధులైన ప్రసాదరావ్‌ సాల్వే, కార్నెలియా సాల్వే దంపతులకు 1923 మార్చి 21న మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారాలో నిర్మలాదేవి జన్మించారు. బాల్యంలో గాంధీజీ ఆశ్రమంలో, ఆధ్యాత్మిక చింతనతో ఆమె పెరిగారు. 1970 మే అయిదున... గుజరాత్‌లోని నార్గోల్‌ సముద్ర తీరంలో ధ్యానంచేస్తూ... మానవాళి అందరికీ కుండలినీ జాగృతిని కలిగించే మార్గాన్ని కనుగొన్నారు. అదే సహజయోగ. ‘సహజ’ అంటే పుట్టుకతో వచ్చినది, ‘యోగ’ అంటే కలయిక. పుట్టుకతోనే మనలో ఉన్న కుండలినీ శక్తిని మేల్కొలపడం ద్వారా పరమాత్మతో అనుసంధానం కావడమే సహజయోగం. ఎటువంటి సభ్యత్వ రుసుము లేకుండా, ధనార్జనాపేక్ష లేకుండా... 120 దేశాల్లో సహజయోగను ‘విశ్వ నిర్మల ధర్మం’గా ఆమె ప్రచారం చేశారు. కుండలినీ జాగృతి ద్వారా శారీరకమైన వ్యాధులు నయంకావడంతో పాటు... మానసిక ఒత్తిడి తగ్గి, మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడని, మద్యపానం, మత్తుపదార్థాల వ్యసనాలు మానడం, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం లాంటివి సహజయోగ ద్వారా సాధ్యమని నిరూపించారు. ‘‘శాంతి అంటే యుద్ధాలు లేకపోవడం కాదు, అది ప్రతి మనిషిలో అంతర్గతంగా ఉండవలసిన స్థితి. ప్రతి వ్యక్తి అంతర్గతంగా శాంతి పొందినప్పుడే ప్రపంచ శాంతి సాధ్యమవుతుంది’’ అని ఆమె స్పష్టం చేశారు. మనలో కోపం, అసూయ, ద్వేషం ఉన్నంత వరకూ బయట ప్రపంచంలో శాంతిని స్థాపించడం సాధ్యం కాదనీ, అది బలవంతంగానో, చట్టాల ద్వారానో జరిగేది కాదనీ, ప్రేమ ద్వారా మాత్రమే శాంతి స్థాపన సాధ్యమనీ చెప్పారు.


ఇప్పుడు నిర్మలాదేవి భౌతికంగా మన మధ్య లేకపోయినా... ఆమె ప్రవేశపెట్టిన సహజయోగ కార్యక్రమాలు ప్రత్యక్షంగానూ, సోషల్‌ మీడియా ద్వారా విద్యాలయాల్లో, కార్పొరేట్‌ సంస్థల్లో, సమాజంలోని వివిధ వర్గాలవారికి అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల వారు నిత్య జీవితంలో ఎదురవుతున్న ఒత్తిడి నుంచి, శ్రమ నుంచి ఉపశమనం పొందుతున్నారు. ప్రపంచ శాంతికి, మానవ కళ్యాణానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆమె ఎన్నో అరుదైన గౌరవాలను సత్కారాలను అందుకున్నారు. శ్రీమాతాజీ 103 జయంతి వేడుకలు ఆమె జన్మస్థలమైన చింద్వారాలో... ఈనెల 21 వరకూ మూడు రోజులపాటు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నాయి. వీటిలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సహజయోగ సాధకులు పాల్గొంటున్నారు.

డాక్టర్‌ పి. రాకేష్‌, 8988982200

‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,

సహజయోగ ట్రస్ట్‌’, తెలంగాణ

ఈ వార్తలు కూడా చదవండి..

నిన్ను చంపేస్తాం.. రాజాసింగ్‌కు ఆగంతకుల బెదిరింపు..

హైదరాబాద్‌లో తమ్ముడి రాక్షసత్వం.. అక్కను హత్య చేసి.. ఆపై దారుణంగా..

యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక మలుపు...

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 20 , 2026 | 01:26 AM