Share News

గులాబీ మ్యాజిక్‌...

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:32 AM

గులాబీ పూలతో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దాం...

గులాబీ మ్యాజిక్‌...

గులాబీ పూలతో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దాం...

  • గులాబీ రేకులను నీడలో ఆరబెట్టి మెత్తటి పొడిలా చేయాలి. దీన్ని గాజుసీసాలో భద్రపరచుకోవాలి. చిన్న గిన్నెలో రెండు చెంచాల గులాబీ రేకుల పొడిని తీసుకుని అందులో రెండు చెంచాల పాలు, చెంచా తేనె వేసి కొన్ని నీళ్లు చిలకరించి మెత్తటి పేస్టులా చేయాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా అప్లయ్‌ చేయాలి. అరగంట తరువాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకుంటే చర్మం ఛాయగా నిగారిస్తుంది.

  • అరకప్పు పాలలో గుప్పెడు గులాబీ రేకులు వేసి అరగంటసేపు నానబెట్టాలి. తరువాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసి గిన్నెలోకి తీయాలి. అందులో చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంటసేపు ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మొటిమలు, నల్ల మచ్చలు తగ్గుతాయి.

  • చిన్న గిన్నెలో రెండు చెంచాల గులాబీ రేకుల పొడి, చెంచా గంధం పొడి, పావు కప్పు పెరుగు వేసి బాగా కలపాలి. ఉదయం నిద్ర లేవగానే ఈ మిశ్రమంతో ముఖానికి ప్యాక్‌ వేసుకోవాలి. అరగంట తరువాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకుంటే ముఖంపై పేరుకున్న మురికి తొలగిపోతుంది. చర్మ రంధ్రాలు శుభ్రమవుతాయి. చర్మం తేమతో నిండి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

సిలిండర్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా చర్యలు: సీఎం చంద్రబాబు

మద్యం స్కాం కేసులో మరో కీలక పరిణామం.. మరో నిందితుడిని విచారిస్తున్న సిట్

గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు: మంత్రి నారాయణ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 19 , 2026 | 12:32 AM