Share News

నారింజ తొక్కలతో...

ABN , Publish Date - Mar 22 , 2026 | 04:13 AM

నారింజ తొక్కలు సువాసన భరితంగా ఉంటాయి. వీటిని ఎండబెట్టి పొడిచేసి రోజ్‌వాటర్‌తో కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటూ ఉంటాం. ఇదే...

నారింజ తొక్కలతో...

నారింజ తొక్కలు సువాసన భరితంగా ఉంటాయి. వీటిని ఎండబెట్టి పొడిచేసి రోజ్‌వాటర్‌తో కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటూ ఉంటాం. ఇదే కాక నారింజ తొక్కతో మరెన్నో ఉపయోగాలున్నాయి...

  • నారింజ తొక్కల్లో డీ-లిమోనేన్‌ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మురికి, దుమ్ము, జిడ్డు మరకలను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది. నారింజ తొక్కలతో లిక్విడ్‌ తయారుచేసి దాంతో ఇల్లు, ఫర్నిచర్‌ తుడిస్తే మంచి ప్రయోజనం కనిపిస్తుంది. ఈ లిక్విడ్‌ను ఎలా తయారుచేయాలంటే... చిన్న గాజు సీసాలో సగానికి పైగా వైట్‌ వెనిగర్‌ను తీసుకోవాలి. అందులో చిన్న ముక్కలుగా కట్‌చేసిన నారింజ తొక్కలు వేసి రెండు వారాలపాటు నానబెట్టాలి. ఆ తరువాత ఒక స్ర్పే బాటిల్‌లోకి వడబోయాలి. అంతే.. మంచి హోం క్లీనర్‌ రెడీ..!

  • కిచెన్‌లో స్టీల్‌ సింక్‌ను నారింజ తొక్కలతో తోమి శుభ్రం చేసుకోవచ్చు. సింక్‌ తళతళలాడడమే కాదు సువాసన కూడా వస్తుంది. అలాగే వీటితో స్టీల్‌ సామాన్లను కూడా తోముకోవచ్చు. ఒక ప్లాస్టిక్‌ కవర్‌ను తీసుకొని దానికి రంధ్రాలు చేయాలి. అందులో కొన్ని నారింజ తొక్కలు, ఐస్‌ క్యూబ్స్‌ వేసి సింక్‌లో ఉన్న పంపుకు తగిలించాలి. ఇలా చేయడంవల్ల సింక్‌ నుంచి దుర్వాసన రాదు.

  • ప్లాస్టిక్‌ డబ్బాలో నారింజ, నిమ్మ తొక్కలను చిన్న చిన్న ముక్కలుగా కోసి వేయాలి. డబ్బాకు మూత బిగించి వారంపాటు ఉంచితే కంపోస్టు తయారవుతుంది. దీన్ని కుండీల్లో మట్టిలో కలిపితే నైట్రోజన్‌ చక్కగా అంది మొక్కలు ఏపుగా పెరుగుతాయి.

  • సాధారణంగా మొక్కలపై క్రిమి కీటకాలు చేరి ఆకులు, పూలను పాడు చేస్తుంటాయి. అలాంటప్పుడు మొక్కల చుట్టూ నారింజ తొక్కలను వేస్తే సమస్య తీరుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు

దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ నిజాలే.. వైఎస్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్

‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్‌ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 22 , 2026 | 04:13 AM