Share News

మజ్జిగ తాగుదాం...

ABN , Publish Date - Aug 31 , 2026 | 01:03 AM

వర్షాకాలంలో పలుచటి మజ్జిగ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే...

మజ్జిగ తాగుదాం...

వర్షాకాలంలో పలుచటి మజ్జిగ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే...

  • వర్షాకాలంలో తేమ వాతావరణం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. అలాంటప్పుడు ఓ కప్పు పెరుగుకి మూడు కప్పుల మంచినీటిని కలిపి తాగితే జీర్ణక్రియ వేగవంతమవుతుంది. మజ్జిగలో ఉండే లాక్టోబాసిల్లస్‌ బ్యాక్టీరియా.. కడుపులో మంట, అజీర్తి, పొట్ట ఉబ్బరం లాంటి సమస్యలను నివారిస్తుంది.

  • రోజూ ఓ గ్లాసు మజ్జిగ తాగితే వర్షాకాలంలో తరచూ ఎదురయ్యే వైరల్‌ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. మజ్జిగలోని బి విటమిన్‌, క్యాల్షియం తదితర పోషకాలు శరీరానికి తక్షణ శక్తిని చేకూరుస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

  • సాధారణంగా వర్షాకాలంలో అంతగా మంచినీటిని తాగకపోవడం వల్ల శరీరంలో ఎలకో్ట్రలైట్ల సమతుల్యత దెబ్బతిని నీరసం రావచ్చు. అలాంటప్పుడు మజ్జిగ తాగితే శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ స్థాయి తగ్గుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది.

  • వర్షాకాలంలో మజ్జిగను ఉదయం లేదా మధ్యాహ్న సమయాల్లో మాత్రమే తాగాలి. రాత్రి పడుకునేముందు తాగకూడదు. మజ్జిగలో చల్లటి నీళ్లు లేదంటే ఐస్‌ క్యూబ్స్‌ కలపకూడదు. గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న తాజా మజ్జిగను మాత్రమే తీసుకోవాలి.

  • పలుచటి మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడి, చిటికెడు నల్ల ఉప్పు, కొద్దిగా అల్లం తురుం, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలిపితే దానిలోని చలువ చేసే గుణాలు సమతుల్యమవుతాయి. కాబట్టి వర్షాకాలంలో మజ్జిగ తాగినా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తుమ్ముల లాంటి సమస్యలు రావు.

ఇవి కూడా చదవండి..

సంజీవని గేమ్ చేంజర్‌గా మారుతుంది: సీఎం చంద్రబాబు

ఉద్యోగులను రెచ్చగొట్టేలా బొప్పరాజు వ్యవహరిస్తున్నారు: మంత్రి అనగాని

తెలుగు భాషకు గిడుగు రామమూర్తి చేసిన కృషి మరువలేనిది: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 31 , 2026 | 01:03 AM