Share News

మలైకా చైనీస్‌ సీక్రెట్‌

ABN , Publish Date - Mar 22 , 2026 | 04:16 AM

కేవలం పది నిమిషాల వ్యాయామంతో ఆరోగ్యం మీ గుప్పిట్లోకి వస్తుందంటున్నారు బాలీవుడ్‌ ఫిట్‌నెస్‌ ఐకాన్‌ మలైకా అరోరా. చైనీస్‌ సంప్రదాయ పద్ధతులతో ఆయుష్షును పెంచుకోవచ్చని ఆమె...

మలైకా చైనీస్‌ సీక్రెట్‌

కేవలం పది నిమిషాల వ్యాయామంతో ఆరోగ్యం మీ గుప్పిట్లోకి వస్తుందంటున్నారు బాలీవుడ్‌ ఫిట్‌నెస్‌ ఐకాన్‌ మలైకా అరోరా. చైనీస్‌ సంప్రదాయ పద్ధతులతో ఆయుష్షును పెంచుకోవచ్చని ఆమె సూచిస్తున్నారు.

వయసు యాభై దాటినా మలైకా అరోరా ఫిట్‌నెస్‌ మాత్రం పీక్‌లో ఉంటుంది. నిత్యం యోగా, వర్కవుట్లతో బిజీగా ఉండే ఈ బ్యూటీ తాజాగా ఒక ప్రత్యేకమైన చైనీస్‌ ఎక్సర్‌సైజ్‌ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘మీ మెడిసిన్‌ క్యాబినెట్‌ను ఖాళీ చేసే శక్తి ఈ పది నిమిషాల వ్యాయామానికి ఉంది’’ అంటూ ఆమె చేసిన పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఏంటా వ్యాయామం...

దాని లాభాలేంటి?

మలైకా షేర్‌ చేసిన వీడియోలో ఆమె తన చేతులను గాల్లోకి విసురుతూ, కాలి వేళ్లపై లేస్తూ శరీరాన్ని వేగంగా అటూ ఇటూ కదిలిస్తున్నారు. దీనిని చైనీయులు ‘ఆరోగ్యకరమైన దీర్ఘాయువు’కు మూలంగా భావిస్తారట. మలైకా మాటల్లో చెప్పాలంటే..

మొదటి రోజు: శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కడుపు, కాలేయం పనితీరు మెరుగవుతుంది. క్రమంగా జీర్ణ సమస్యలు మాయమవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. ముఖ్యమంగా శరీరంలోని కొవ్వును కరిగించడానికి ఇది అత్యంత వేగవంతమైన మార్గం.

నిపుణులు ఏమంటున్నారు?

ఈ చైనీస్‌ మూవ్‌మెంట్స్‌ గురించి వైద్య నిపుణులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఓ ప్రముఖ ఆసుపత్రిలోని కన్సల్టెంట్‌ డాక్టర్‌ స్వప్నిల్‌ జాంబరే దీని వెనుక ఉన్న సైన్స్‌ను వివరించారు. ‘‘ఈ వ్యాయామంలో శ్వాసపై నియంత్రణ, శరీర కదలికలు ‘లింఫాటిక్‌ ఫ్లో‘ (శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడం)కు తోడ్పడతాయి. కండరాలు సాగడం వల్ల రక్త ప్రసరణ పెరిగి, ఆక్సిజన్‌ సరఫరా మెరుగవుతుంది. దీనివల్ల కీళ్ల నొప్పులు తగ్గడమే కాకుండా శరీరంలో ఎంతో ఉత్సాహంగా మారుతుంది’’ అని ఆయన చెప్పుకొచ్చారు.


వృద్ధులకు ఒక వరం

వయసు పెరిగే కొద్దీ కీళ్లు బిగుసుకుపోవడం, బ్యాలెన్స్‌ తప్పడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ చైనీస్‌ వ్యాయామం చాలా తేలికగా ఉండటం వల్ల వృద్ధులు కూడా సులభంగా చేయవచ్చు. ఇది మెడ, భుజాలు, నడుము నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుందని డాక్టర్‌ స్వప్నిల్‌ వివరించారు.

మీరూ మొదలుపెట్టాలను

కుంటున్నారా?

మలైకా చెప్పినట్టుగా మీరు కూడా ఈ వర్కవుట్‌ ట్రై చేయాలనుకుంటే ఈ సూచనలు పాటించండి.

మెల్లగా మొదలుపెట్టండి: రోజుకు 10-15 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది. పర్ఫెక్షన్‌ కంటే కంఫర్ట్‌ ముఖ్యం.

అన్నింటికీ ఇదే పరిష్కారం కాదు: ఇది రక్త ప్రసరణకు, ఫ్లెక్సిబిలిటీకి మంచిదే కానీ కండరాల బలం కోసం నడక, యోగా లేదా వెయిట్‌ ట్రెయినింగ్‌తో దీనిని జత చేయడం ఉత్తమం.

డైట్‌ ముఖ్యం: కేవలం ఈ వ్యాయామంతోనే బరువు తగ్గిపోరు. సరైన ఆహారం, తగినంత నిద్ర, ఒత్తిడి లేని జీవితం తోడైతేనే అద్భుత ఫలితాలు వస్తాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు

దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ నిజాలే.. వైఎస్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్

‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్‌ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 22 , 2026 | 04:16 AM