Share News

టమాటాలను ఇలా...

ABN , Publish Date - Nov 01 , 2026 | 03:08 AM

మార్కెట్‌ నుంచి తెచ్చిన టమాటాలను నేరుగా ఫ్రిజ్‌లో పెడితే వాటి ఆరోగ్య ప్రయోజనాలు దెబ్బతింటాయని నిపుణులు...

టమాటాలను ఇలా...

మార్కెట్‌ నుంచి తెచ్చిన టమాటాలను నేరుగా ఫ్రిజ్‌లో పెడితే వాటి ఆరోగ్య ప్రయోజనాలు దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాకాకుండా వాటిని ఎలా నిల్వ చేయాలో తెలుసుకుందాం...

  • ఫ్రిజ్‌లో ఉండే చల్లదనంవల్ల టమాటాల్లోని అంతర్గత కణజాలం దెబ్బతిని పిండిలా మారుతుంది. దీంతో టమాటాలకు సహజంగా ఉండే కరకరలాడే స్వభావం, కమ్మటి రుచి, సువాసన మాయమవుతా యి. వాటిలోని పోషకాలు కూడా నశిస్తాయి. కాబట్టి టమాటాలను ఫ్రిజ్‌లో అలాగే చల్లటి ప్రాంతాల్లో ఉంచకూడదు.

  • నేరుగా ఎండ తగలకుండా బాగా గాలి ఆడేలా టమాటాలను వంటింటి అరల్లో పెట్టవచ్చు. గది ఉష్ణోగ్రత వద్ద మాత్రమే టమాటాలు పోషకాలను సమకూర్చుకుంటాయి.

  • బుట్టలో గుట్టలా పోయకుండా సాధ్యమైనంతవరకు విడివిడిగా ఉండేలా పరచి ఉంచడం మంచిది.

  • ముచ్చిక భాగం కిందికి ఉండేలా పెట్టాలి. అప్పుడే వాటి కాడల నుంచి గాలి బయటికి వెళ్లకుండా ఉంటుంది. తేమ కూడా నిలుస్తుంది. టమాటాలు చాలా రోజులు కుళ్లిపోకుండా తాజాగా ఉంటాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

తుఫాన్ నష్టంపై సమగ్ర అంచనా.. ప్రతి బాధితుడికి న్యాయం: సీఎం చంద్రబాబు

మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అన్వేషించాలి: పవన్ కల్యాణ్

స్థానిక ఎన్నికలు.. బ్యాలెట్ పేపర్ల భద్రతలో ఎలాంటి లోపాలకు తావుండకూడదు: ఏపీ ఎస్‌ఈసీ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 01 , 2026 | 03:08 AM