ఇలా సరిచేయాలి...
ABN , Publish Date - Sep 06 , 2026 | 03:09 AM
ఒక్కోసారి పర్సులు, బ్యాగ్‌లు, దుస్తులకు ఉన్న జిప్పులు సరిగా పనిచేయక మధ్యలోనే ఆగిపోతుంటాయి. అలాంటప్పుడు వాటిని గట్టిగా లాగకుండా ఎలా సరిచేయాలో చూద్దాం...
ఒక్కోసారి పర్సులు, బ్యాగ్‌లు, దుస్తులకు ఉన్న జిప్పులు సరిగా పనిచేయక మధ్యలోనే ఆగిపోతుంటాయి. అలాంటప్పుడు వాటిని గట్టిగా లాగకుండా ఎలా సరిచేయాలో చూద్దాం...
చేత్తో కొద్దిగా కొబ్బరినూనెను తీసుకుని జిప్ ట్రాక్‌మీద రాయాలి. తరువాత జిప్ స్లైడర్‌ను నెమ్మదిగా ముందుకు, వెనక్కు కదిలిస్తుంటే సమస్య తీరుతుంది.
సాధారణంగా జిప్ రన్నర్ కింద దారాలు లేదంటే క్లాత్ ఇరుక్కుంటూ ఉంటాయి. వీటిని చేత్తో మెల్లగా తొలగిస్తే సరిపోతుంది.
జిప్ ట్రాక్‌ను పాత టూత్‌బ్రష్‌తో శుభ్రం చేస్తుంటే వాటిలో చేరిన దుమ్ము, మురికి, చిన్న చిన్న వ్యర్థాలు తొలగిపోతాయి. దీంతో జిప్పులకు ఎలాంటి ఇబ్బంది రాదు.
జిప్ ట్రాక్‌లోని పళ్లలో వంకరపోయినవాటిని యథాస్థితికి వచ్చేలా సరిచేసినా ప్రయోజనం ఉంటుంది. ఈ పళ్లమీద పెన్సిల్ లేదా సబ్బు ముక్కతో తరచూ రుద్దుతుంటే జిప్పులు చాలా రోజులు మన్నికగా ఉంటాయి.
స్లైడర్ వదులుగా మారినా కూడా జిప్ లాక్ అవ్వదు. ప్లయర్ సహాయంతో స్లైడర్ వెనక భాగాన్ని కొద్ది కొద్దిగా ఒత్తుతూ సరిచేస్తే ఫలితం కనిపిస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి
సన్నబియ్యం అమ్మితే రేషన్ కార్డు తొలగిస్తాం: మంత్రి తుమ్మల
రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారు.. హరీశ్‌రావు ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News