Share News

పాదాల్లో ఆనెలా..?

ABN , Publish Date - Nov 01 , 2026 | 03:06 AM

పాదాల కింద, వేళ్ల మధ్య పదేపదే రాపిడి తగులుతుంటే అక్కడి చర్మం గట్టిపడి ఆనెలు ఏర్పడుతుంటాయి. బిగుతుగా ఉండే షూస్‌ లేదా చెప్పులు వేసుకున్నా...

పాదాల్లో ఆనెలా..?

పాదాల కింద, వేళ్ల మధ్య పదేపదే రాపిడి తగులుతుంటే అక్కడి చర్మం గట్టిపడి ఆనెలు ఏర్పడుతుంటాయి. బిగుతుగా ఉండే షూస్‌ లేదా చెప్పులు వేసుకున్నా, ఎక్కువసేపు నిలబడినా, నడిచినా ఈ సమస్య ఎదురవుతుంది. వీటిని సులువుగా మాయం చేసే ఇంటి చిట్కాలివే...

  • ఓ టబ్‌లో సగానికిపైగా గోరువెచ్చటి నీటిని తీసుకోవాలి. అందులో మూడు చెంచాల ఎప్సమ్‌ సాల్ట్‌ వేసి కరిగించాలి. ఈ నీటిలో పాదాలను అరగంటసేపు ఉంచాలి. ఎప్సమ్‌ సాల్ట్‌లోని మెగ్నీషియం సల్ఫేట్‌ వల్ల పాదాల వాపు, నొప్పి పూర్తిగా తగ్గుతాయి. పాదాలు బాగా నానిన తరువాత ప్యూమిన్‌ స్టోన్‌తో ఆనెలపై గుండ్రంగా రుద్దితే మురికి, మృతకణాలు తొలగి సమస్య తీరుతుంది.

  • రాత్రి పడుకునేముందు దూదిని యాపిల్‌ సైడర్‌ వెనిగర్లో ముంచి ఆనెలపై ఉంచి దానిమీద బ్యాండేజ్‌ లేదా మెడికల్‌ ప్లాస్టర్‌ వేయాలి. ఉదయాన్నే వాటిని తొలగించి గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. యాపిల్‌ సైడర్‌ వెనిగర్లో ఉండే ఎసిటిక్‌ యాసిడ్‌ ప్రభావవంతంగా పనిచేసి ఆనెల్లో ఉండే కెరాటిన్‌ పొరలను కరిగిస్తుంది.

  • రెండు వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి అందులో నాలుగు చుక్కల నువ్వుల నూనె వేసి కలపాలి. రాత్రి పడుకునేముందు ఈ మిశ్రమాన్ని ఆనెలపై ఉంచి గట్టిగా కట్టు కట్టాలి. వెల్లుల్లిలోని అల్లిసిన్‌ సమ్మేళనాలు.. ఆనెలపై రక్తప్రసరణను పెంచి నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇలా రోజూ చేస్తుంటే క్రమంగా ఆనెలు మాయమవుతాయి.

  • కలబంద గుజ్జును ఆనెలపై పట్టించి పది నిముషాలు మర్దన చేయాలి. ఇలా రోజుకు నాలుగుసార్లు చేస్తుంటే ఆనెల్లో తేమ పెరిగి నొప్పి తగ్గుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

తుఫాన్ నష్టంపై సమగ్ర అంచనా.. ప్రతి బాధితుడికి న్యాయం: సీఎం చంద్రబాబు

మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అన్వేషించాలి: పవన్ కల్యాణ్

స్థానిక ఎన్నికలు.. బ్యాలెట్ పేపర్ల భద్రతలో ఎలాంటి లోపాలకు తావుండకూడదు: ఏపీ ఎస్‌ఈసీ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 01 , 2026 | 03:06 AM