Share News

అవిసెల జెల్‌తో...

ABN , Publish Date - Nov 01 , 2026 | 03:03 AM

శిరోజాలు నల్లగా ఒత్తుగా పెరిగేందుకు ఉపకరించే అవిసెల జెల్‌ తయారీ విధానాన్ని తెలుసుకుందాం...

అవిసెల జెల్‌తో...

శిరోజాలు నల్లగా ఒత్తుగా పెరిగేందుకు ఉపకరించే అవిసెల జెల్‌ తయారీ విధానాన్ని తెలుసుకుందాం...

  • స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి నాలుగు కప్పుల నీటిని పోసి వేడిచేయాలి. ఆపైన అరకప్పు అవిసె గింజలు వేసి చిన్న మంటమీద ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. పది నిముషాల్లో జెల్‌ లాంటి మిశ్రమం తయారవుతుంది. వెంటనే స్టవ్‌ మీద నుంచి దించి చల్లార్చాలి. ఆపైన సన్నని గుడ్డ సహాయంతో వడకడితే అవిసెల జెల్‌ సిద్ధమవుతుంది.

  • ముందుగా తలస్నానం చేయాలి. తరువాత చేత్తో కొద్దికొద్దిగా అవిసెల జెల్‌ను తీసుకుంటూ మాడు మీద నుంచి శిరోజాల చివర్ల వరకు పట్టించాలి. తరువాత షవర్‌ క్యాప్‌ ధరించి అరగంటసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఆపైన గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి.

  • వారానికి రెండుసార్లు అవిసెల జెల్‌ను అప్లయ్‌ చేసుకుంటూ ఉంటే శిరోజాలు తేమతో నిండి నిగనిగలాడతాయి. కురులు చిక్కు పడవు. కుదుళ్లకు పోషణ లభించి శిరోజాలు ఒత్తుగా పెరుగుతాయి. మాడు మీద చుండ్రు సమస్య తీరుతుంది

ఈ వార్తలు కూడా చదవండి..

తుఫాన్ నష్టంపై సమగ్ర అంచనా.. ప్రతి బాధితుడికి న్యాయం: సీఎం చంద్రబాబు

మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అన్వేషించాలి: పవన్ కల్యాణ్

స్థానిక ఎన్నికలు.. బ్యాలెట్ పేపర్ల భద్రతలో ఎలాంటి లోపాలకు తావుండకూడదు: ఏపీ ఎస్‌ఈసీ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 01 , 2026 | 03:04 AM