అరటిపండుతో ఆరోగ్య ప్రయోజనాలు...
ABN , Publish Date - Sep 07 , 2026 | 01:56 AM
విటమిన్లు, ఖనిజాలు, పీచు, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే అరటి పండును రోజుకు ఒకటి చొప్పున తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం...
విటమిన్లు, ఖనిజాలు, పీచు, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే అరటి పండును రోజుకు ఒకటి చొప్పున తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం...
అరటి పండులో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్, కడుపులోకి చేరగానే జెల్ మాదిరిగా మారే పీచు కలిసి రక్తంలో చక్కెర త్వరగా కలవకుండా నిరోధిస్తాయి. కాబట్టి నీరసంగా అనిపించినప్పుడు అరటి పండును తింటే రక్తంలో చక్కెర సమతుల్యత దెబ్బతినకుండా శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.
అరటి పండులోని ప్రీ బయోటిక్ గుణాలు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడతాయి. దీనిలో ఉండే పెక్టిన్... మలబద్దకాన్ని నివారిస్తుంది. జీర్ణ నాళాన్ని శుభ్రం చేస్తుంది.
అరటి పండులో కార్బోహైడ్రేట్లు అధికం. అందుకే దీన్ని తిన్న తరువాత చాలాసేపటి వరకు ఆకలి అనిపించదు. ఇతర చిరుతిళ్లవైపు మనసు మళ్లదు. దీనివల్ల క్రమంగా శరీర బరువు అదుపులోకి వస్తుంది.
దీనిలోని పొటాషియం, మెగ్నీషియం కలిసి రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి. రక్తపోటును తగ్గిస్తాయి. గుండె జబ్బులను నివారిస్తాయి. మూత్రపిండాల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.
అరటి పండ్లలోని ఫ్లేవనాయిడ్లు, అమైనో ఆమ్లాలు... ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడతాయి. అకాల వార్థక్యాన్ని నివారిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News