ఆలుగడ్డ తొక్కతో...
ABN , Publish Date - Sep 07 , 2026 | 01:37 AM
ఆలుగడ్డ తొక్కను పడేయకుండా ఎలా వాడుకోవచ్చో చూద్దాం...
ఆలుగడ్డ తొక్కను పడేయకుండా ఎలా వాడుకోవచ్చో చూద్దాం...
దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ తొక్కను గులాబీ నీళ్లలో ముంచి దానితో ముఖంపై మెల్లగా మర్దన చేస్తే చర్మంపై పేరుకున్న దుమ్ము, జిడ్డు, మృతకణాలతో పాటు చర్మ రంధ్రాల్లో చేరిన మురికి తొలగిపోతాయి. మిక్సీలో ఆలుగడ్డ తొక్కలు వేసి కొన్ని పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పేస్టుని ఫేస్ ప్యాక్‌లా ముఖానికి అప్లయ్ చేసి అరగంట తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే క్రమంగా మొటిమలు, మచ్చలు, ట్యానింగ్ మాయమవుతాయి.
స్టవ్‌మీద మందపాటి గిన్నెను పెట్టి అందులో రెండు గుప్పెళ్ల తొక్కలు వేసి లీటరు మంచినీటిని పోసి బాగా మరిగించాలి. నీరు సగానికి తగ్గిన తరువాత దించి చల్లార్చి మరో గిన్నెలోకి వడబోయాలి. తలస్నానం చేసిన తరువాత ఈ నీటిని కండిషనర్‌లా ఉపయోగిస్తే శిరోజాలు తేమతో నిండి మృదువుగా మారడంతోపాటు నల్లగా మెరుస్తాయి.
ఆలుగడ్డ తొక్కలను అరగంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆపైన వాటిని కళ్లపై ఉంచుకొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఈ తొక్కల్లో ఉండే కాటెకోలేస్ ఎంజైమ్‌లు ప్రభావవంతంగా పనిచేసి కళ్ల అలసటను పోగొడతాయి. కళ్ల కింద వాపు, నల్లటి వలయాలను తొలగిస్తాయి.
నల్లగా మారిన వెండి వస్తువలు, నీటి మరకలతో నిండిన స్టీల్ పంపులను ఆలుగడ్డ తొక్కలతో రుద్ది మెరిపించవచ్చు. సింక్‌పై ఉండే అద్దాన్ని, డ్రెస్సింగ్ మిర్రర్‌ను ఈ తొక్కలతో రుద్ది ఆపైన పలుచటి కాగితంతో తుడిచేస్తే అవి తేలికగా శుభ్రమవుతాయి.
ఈ తొక్కలలో పొటాషియం, మెగ్నీషియం, పాస్ఫరస్ లాంటి ఖనిజాలతోపాటు పీచులు, ఫినోలిక్ ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని చిన్న ముక్కలుగా చేసి మొక్కల చుట్టూ వేస్తే మట్టి సారవంతమవుతుంది. ఈ తొక్కలను ఓ టబ్‌లో వేసి అవి మునిగేవరకు నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని మొక్కలకు అందిస్తే అవి ఆరోగ్యంగా పెరుగుతాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News