సెంటు సీసాలు పడేస్తున్నారా?
ABN , Publish Date - Sep 06 , 2026 | 03:10 AM
చక్కని క్రిస్టల్ మెటీరియల్‌తో అందంగా మెరిసే సెంటు సీసాలను వినియోగించి ఇంటికి రాయల్ లుక్ తేవచ్చు.
చక్కని క్రిస్టల్ మెటీరియల్‌తో అందంగా మెరిసే సెంటు సీసాలను వినియోగించి ఇంటికి రాయల్ లుక్ తేవచ్చు.
చిన్నమూతితో పొడవుగా ఉండే పెర్ఫ్యూమ్ బాటిల్‌లో కొన్ని నీళ్లు పోసి రంగు రంగుల పూల గుత్తి లేదా ఒకట్రెండు పూల కొమ్మలను ఉంచితే అందమైన వేజ్‌లా కనిపిస్తుంది. దీన్ని కిటికీల దగ్గర, డ్రెస్సింగ్ మిర్రర్ పక్కన, ఆఫీస్ టేబుల్ మీద పెడితే బాగుంటుంది. అలాంటి రెండు మూడు వేర్వేరు డిజైన్లలో ఉన్న బాటిల్స్‌ను కలిపి పెడితే గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది.
లావుగా పెద్దగా ఉండే సెంటు సీసాలను శుభ్రం చేసి వాటిలో ఇష్టమైన డిఫ్యూజర్ ఆయిల్ పోసి నాలుగైదు రీడ్ స్టిక్స్‌ను ఉంచి గాలి, వెలుతురు ప్రసరించే చోట పెట్టాలి. రీడ్ స్టిక్స్ ఆ నూనెను పీల్చుకుని ఇల్లంతా సువాసనలు వెదజల్లుతాయి. బెడ్‌రూమ్‌లో లావెండర్, జాస్మిన్, రోజ్ ఆయిల్స్; హాల్లో ఆరెంజ్, లెమన్, లెమన్ గ్రాస్, బెర్గామోట్ ఆయిల్స్; స్టడీ రూమ్‌లో యూకలిప్టస్, శాండల్, మింట్, సాంబ్రాణి ఆయిల్స్ వాడితే అహ్లాదకరంగా ఉంటుంది.
సాదా గాజు మెటీరియల్‌తో తయారుచేసిన సెంటు సీసాల్లో బ్యాటరీతో పనిచేసే మినీ లెడ్ లేదా కార్క్ ఫెయిరీ లైట్లను ఉంచి వెలిగిస్తే రాత్రిపూట ఇల్లంతా శోభాయమానంగా కనిపిస్తుంది. వీటిని హాల్, బెడ్‌రూమ్‌లలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే వాళ్లకి అందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
మూతి వెడల్పుగా ఉన్న సెంటు సీసాల్లో చిన్న చిన్న ఉంగరాలు, చెవి పోగులు, హెయిర్ క్లిప్స్, బాబీ పిన్స్, శారీ పిన్స్, యూ పిన్స్ లాంటివాటిని వేసుకుని డ్రెస్సింగ్ టేబుల్‌పై పెట్టుకోవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి
సన్నబియ్యం అమ్మితే రేషన్ కార్డు తొలగిస్తాం: మంత్రి తుమ్మల
రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారు.. హరీశ్‌రావు ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News