కొబ్బరి చిప్పలతో ఇలా...
ABN , Publish Date - Oct 26 , 2026 | 03:40 AM
కొబ్బరిని తీసుకున్న తరువాత చిప్పలను పడేయకుండా ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం...
కొబ్బరిని తీసుకున్న తరువాత చిప్పలను పడేయకుండా ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం...
చిప్పలకు బయట ఉన్న పీచును తీసివేసి లోపల కూడా శుభ్రం చేసి అడుగున రెండు రంధ్రాలు చేయాలి. ఆపైన వాటిని మట్టితో నింపి చిన్న పూల మొక్కలు, అలంకరణ మొక్కలు నాటాలి. వీటిని కిటికీలకు బాల్కనీలో ఇంటి ముందు వేలాడదీస్తే అందంగా కనిపిస్తాయి.
కొన్ని చిప్పల్లో సగం వరకు ధాన్యాన్ని లేదా గింజలను ఉంచాలి. మరికొన్నింటిలో నీటిని నింపాలి. ఆపైన ఈ చిప్పలన్నింటినీ ఇంటి ముందున్న చెట్టు కొమ్మలకు, మిద్దె తోట మధ్యలో, బాల్కనీలో వేలాడదీస్తే పక్షులు చేరి కిలకిలా రావాలతో సందడి చేస్తాయి.
ఇంటి పరిసరాల్లో పెంచుతున్న పూల మొక్కల మడుల చుట్టూ, మిద్దె తోట దారుల వెంట ఈ చిప్పలను బోర్లిస్తే అందమైన ఆకృతి ఏర్పడడంతోపాటు అహ్లాదకరంగా కనిపిస్తుంది.
చిప్పల్లో సారవంతమైన మట్టిని నింపి కొద్దిగా నీటిని చిలకరించి మెంతులు, ధనియాలు చల్లితే వారం రోజుల్లో మెంతికూర, కొత్తిమీర సిద్ధమవుతాయి. అలాగే కనకాంబరం, బంతి పూల నారు తయారుచేసుకోవచ్చు.
కొబ్బరి చిప్పలను అందంగా కట్చేసి కప్పులు, గిన్నెలు, చెంచాలు, కొవ్వొత్తి స్టాండ్లు, రకరకాల షోపీస్లు తయారుచేయవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి:
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
మీ-సేవలోడ్రైవింగ్ లైసెన్సు వీడియో!
Read Latest AP News And Telangana News And International News And Telugu News