సర్కాడియన్ ఈటింగ్.. మహిళల సీక్రెట్ హెల్త్
ABN , Publish Date - Oct 26 , 2026 | 04:29 AM
మనం ఏ ఆహారం తీసుకుంటున్నాం అనే దానికంటే.. ఏ సమయానికి తీసుకుంటున్నాం అనేదే మహిళల హార్మోన్ల సమతుల్యతను నిర్ణయిస్తుందని నిపుణులు చెబుతున్నారు...
మనం ఏ ఆహారం తీసుకుంటున్నాం అనే దానికంటే.. ఏ సమయానికి తీసుకుంటున్నాం అనేదే మహిళల హార్మోన్ల సమతుల్యతను నిర్ణయిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇంటి పనులు, ఉద్యోగం, పిల్లల బాధ్యతల్లో పడి చాలామంది మహిళలు ఉదయం అల్పాహారాన్ని దాటవేయడం, రాత్రివేళల్లో ఆలస్యంగా భోజనం చేయడం చేస్తుంటారు. అయితే, ఈ అలవాటు శరీరంలోని జీవగడియారాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. మన శరీరంలో నడిచే సహజ సిద్ధమైన జీవగడియారానికి అనుగుణంగా ఆహారం తినే పద్ధతినే ‘సర్కాడియన్ ఈటింగ్’ అంటారు.
సూర్యుడి గమనంతో జీర్ణక్రియ: మన జీర్ణక్రియ సూర్యోదయంతో ప్రారంభమై, మధ్యాహ్నానికి గరిష్ఠ స్థాయికి చేరుకుని, సూర్యాస్తమయం తర్వాత మందగిస్తుంది. ఉదయం సూర్యోదయం అయిన 1-2 గంటల్లో అల్పాహారం తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన ప్రాథమిక శక్తి లభిస్తుంది.
హార్మోన్ల సమతుల్యత: మహిళల శరీరంలో ఈస్ర్టోజెన్, ప్రొజెస్టెరాన్, ఇన్సులిన్ హార్మోన్లు చాలా సున్నితంగా ఉంటాయి. వేళాపాళా లేని ఆహారపు అలవాట్ల వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరిగి థైరాయిడ్, పీసీవోడీ, హార్మోనల్ అసమతుల్యత వంటి సమస్యలు త్వరగా దాడిచేస్తాయి.
బరువు నియంత్రణ: సాయంత్రం ఏడెనిమిది గంటల్లోపే భోజనం పూర్తిచేయడం వల్ల రాత్రివేళల్లో జీర్ణవ్యవస్థకు పూర్తి విశ్రాంతి లభిస్తుంది. దీనివల్ల శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోకుండా బరువు అదుపులో ఉంటుంది.
నిద్ర నాణ్యత: ఆలస్యంగా తిని వెంటనే పడుకోవడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ సరిగ్గా జరగక కడుపు ఉబ్బరం, అసిడిటీ వేధిస్తాయి. ఇవి రాత్రి వేళల్లో ప్రశాంతమైన నిద్రను దూరం చేస్తాయి.
ఇలా చేయాలి
ఉదయం టిఫిన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ స్కిప్ చేయకూడదు.
మధ్యాహ్న భోజనంలో ప్రొటీన్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
రాత్రి భోజనం వీలైనంత తేలికగా ఉండాలి. రాత్రి 8 గంటల లోపే పూర్తిచేయాలి.
రాత్రి భోజనానికి, పడుకునే సమయానికి మధ్య కనీసం 2 నుంచి 3 గంటల వ్యవధి ఉండాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
మీ-సేవలోడ్రైవింగ్ లైసెన్సు వీడియో!
Read Latest AP News And Telangana News And International News And Telugu News