బాడీ క్లాక్.. మహిళలకు ఫిట్‌నెస్ సీక్రెట్
ABN , Publish Date - Oct 26 , 2026 | 04:32 AM
మహిళలు సమయం దొరికినప్పుడే వ్యాయామం చేయడం కాకుండా.. శరీరంలోని హార్మోన్ల చక్రానికి తగినట్టుగా వ్యాయామం చేస్తేనే పూర్తి ఫలితం ఉంటుందని ఫిట్‌నెస్...
మహిళలు సమయం దొరికినప్పుడే వ్యాయామం చేయడం కాకుండా.. శరీరంలోని హార్మోన్ల చక్రానికి తగినట్టుగా వ్యాయామం చేస్తేనే పూర్తి ఫలితం ఉంటుందని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు.
సమయం దొరికినప్పుడల్లా జిమ్‌కు వెళ్లడం లేదా ఎప్పుడో ఒకప్పుడు వర్కవుట్లు చేయడం వల్ల మహిళలకు ఆశించిన ఫలితాలు రావు. ఇందుకు వారి శరీరంలోని ప్రత్యేకమైన హార్మోన్ల నిర్మాణమే కారణం. పురుషులతో పోలిస్తే మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు నెలసరి చక్రానికి అనుగుణంగా మారుతుంటాయి. దీనికి తగినట్టుగా వ్యాయామ శైలిని మార్చుకోవడాన్ని ‘సైకిల్ సింక్డ్ వర్కవుట్స్’ అంటారు.
మొదటి వారం (ఫోలిక్యులర్ దశ): పీరియడ్స్ ముగిసిన మొదటి వారంలో శరీరంలోని ఈస్ట్రోజోన్ స్థాయిలు క్రమంగా పెరుగుతాయి. ఈ సమయంలో శక్తిబాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగింగ్, హెవీ వెయిట్ ట్రైనింగ్, ఏరోబిక్స్ వంటి కఠిన వ్యాయామాలు చేయడానికి ఇది సరైన సమయం.
రెండోవారం (అవులేషన్ దశ): ఈ సమయంలో శక్తి గరిష్ఠ స్థాయిలో ఉంటుంది. బాడీ టోనింగ్ కోసం క్రాస్‌ఫిట్ లేదా హై ఇంటెన్సిటీ వర్కవుట్లు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.
మూడోవారం (లూటియల్ దశ): పీరియడ్స్‌కు ముందు వచ్చే ఈ దశలో హార్మోన్ల ప్రభావంతో శరీరం త్వరగా అలసిపోతుంది. మూడ్ స్వింగ్స్ వస్తాయి. ఈ సమయంలో కఠినమైన వ్యాయామాలు మానేసి, తేలికపాటి వాకింగ్, పిలేట్స్ లేదా సైక్లింగ్ చేయడం ఉత్తమం.
నాలుగో వారం (పీరియడ్స్ సమయం): రక్తం కోల్పోవడం వల్ల శరీరంలో శక్తి తాత్కాలికంగా తగ్గుతుంది. ఈ రోజుల్లో ఎలాంటి కఠిన వ్యాయామాలు చేయకుండా, కేవలం లైట్ స్ట్రెచింగ్ లేదా యోగా, ప్రాణాయామం వంటివి మాత్రమే చేయడం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది.
ప్రయోజనాలు
హార్మోన్ల అసమతుల్యత అదుపులో ఉంటుంది.
వ్యాయామం చేసినా బరువు తగ్గని సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.
కండరాల నొప్పులు, పీరియడ్స్ నొప్పుల తీవ్రత తగ్గుతుంది.
శరీరం చెప్పే మాటను విని దానికి తగినట్టుగా వ్యాయామ శైలిని మార్చుకోవడమే మహిళలకు అసలైన స్మార్ట్ అండ్ హెల్దీ ఫిట్‌నెస్ మంత్ర. కఠినమైన డైటింగ్‌లు చేయడం కంటే సరిగ్గా సమయానికి ఆహారం తీసుకోవడం ద్వారానే మహిళలకు అసలైన ఆరోగ్యం లభిస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
మీ-సేవలోడ్రైవింగ్ లైసెన్సు వీడియో!
Read Latest AP News And Telangana News And International News And Telugu News