Share News

చర్మ కాంతికి..

ABN , Publish Date - Aug 31 , 2026 | 12:51 AM

వర్షాకాలంలో ఎదురయ్యే ఉక్కపోత, తేమ కారణంగా ముఖంపై మురికి పేరుకుపోయి మొటిమలు, మచ్చలు ఏర్పడుతుంటాయి. వీటిని సులువుగా నివారించేందుకు పాటించాల్సిన...

చర్మ కాంతికి..

వర్షాకాలంలో ఎదురయ్యే ఉక్కపోత, తేమ కారణంగా ముఖంపై మురికి పేరుకుపోయి మొటిమలు, మచ్చలు ఏర్పడుతుంటాయి. వీటిని సులువుగా నివారించేందుకు పాటించాల్సిన ఇంటి చిట్కాలివే..

  • పచ్చి పాలలో ముంచిన దూదితో ముఖాన్ని సున్నితంగా రుద్ది ఆపైన గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. పాలలోని లాక్టిక్‌ యాసిడ్‌ చర్మంపై పేరుకున్న మృతకణాలు, మురికి, జిడ్డులను తొలగించి ముఖాన్ని కాంతివంతంగా మార్చేస్తుంది.

  • బాగా పండిన టమాటాను మధ్యకు కోసి దానితో ముఖంపై కింది నుంచి పైకి గుండ్రంగా రుద్దాలి. పావుగంట తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే చర్మ రంధ్రాలు పూర్తిగా శుభ్రమవుతాయి. ఇలా రెండురోజులకోసారి చేస్తుంటే పిగ్మెంటేషన్‌, మొటిమల బాధ తగ్గుతాయి.

  • ముఖానికి తేనెను పట్టించి అరగంట తరువాత చల్లటి నీటితో కడిగేసుకుంటే చర్మం తేమతో నిండి బిగుతుగా, ఛాయగా, మృదువుగా మారుతుంది.

  • ముఖానికి బంగాళదుంప రసాన్ని రాసి అరగంటసేపు ఆరనివ్వాలి. తరువాత చేతి వేళ్లతో నెమ్మదిగా మర్దన చేస్తే నుదుటిమీద, ముక్కుకు ఇరు ప్రక్కల ఉండే బ్లాక్‌ హెడ్స్‌ తొలగిపోతాయి. చర్మం పొరల్లో రక్తప్రసరణ పెరిగి ముఖం నిగారిస్తుంది.

  • జిడ్డు చర్మంతో బాధపడేవారికి ముల్తాని మిట్టి అద్భుతంగా పనిచేస్తుంది. చిన్న గిన్నెలో చెంచా ముల్తాని మిట్టి, రెండు లేదా మూడు చెంచాల గులాబి నీళ్లు వేసి బాగా కలిపి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంటసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఆపైన చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి..

సంజీవని గేమ్ చేంజర్‌గా మారుతుంది: సీఎం చంద్రబాబు

ఉద్యోగులను రెచ్చగొట్టేలా బొప్పరాజు వ్యవహరిస్తున్నారు: మంత్రి అనగాని

తెలుగు భాషకు గిడుగు రామమూర్తి చేసిన కృషి మరువలేనిది: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 31 , 2026 | 12:51 AM