ఉద్యోగితో ఫిట్‌నెస్ బెట్.. రూ.2.5 లక్షలు పోగొట్టుకున్న జెరోదా చీఫ్..
ABN , Publish Date - Jun 18 , 2026 | 09:50 PM
జెరోదా సహ వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ కామత్ తాజాగా చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగితో పందెం కాసి రూ.2.5 లక్షలు కోల్పోయానని తెలిపారు.
జెరోదా సహ వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ కామత్ తాజాగా చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగితో పందెం కాసి రూ.2.5 లక్షలు కోల్పోయానని, అయినప్పటికీ ఆ ఓటమి తనకు సంతోషాన్నే ఇచ్చిందని ఆయన వెల్లడించారు. ఆ ఉద్యోగి తన బరువును గణనీయంగా తగ్గించుకోగలిగితే నగదు బహుమతి ఇస్తానని కామత్ పందెం కాశారు (Nithin Kamath Rs. 2.5 lakh bet).
జెరోదాలో పని చేస్తున్న రోహిత్ అగర్వాల్‌తో నితిన్ కామత్ గతేడాది పందెం వేశారు. అతడు 30 కిలోల బరువు తగ్గితే రూ.2.5 లక్షలు చెల్లిస్తానని మాటిచ్చారు. నితిన్‌తో బెట్‌ను రోహిత్ సీరియస్‌గా తీసుకున్నారు. కఠినమైన వ్యాయామం, డైటింగ్ చేసి 30 కిలోలు తగ్గారు. దీంతో నితిన్ అతడికి రూ.2.5 లక్షలు చెల్లించారు. బెట్‌లో తాను ఓడిపోయినప్పటికీ, ఉద్యోగి బరువు తగ్గడం తనకు సంతోషం కలిగించిందని నితిన్ పేర్కొన్నారు (weight loss transformation).
కాగా, తాను 104 కిలలో నుంచి 74 కిలోలకు వచ్చానని రోహిత్ తెలిపారు (Zerodha employee). 'ఏడాది కాలంలో 30 కిలోలు తగ్గాను. ఇందుకోసం ఎంతో కష్టపడ్డాను. డబ్బు గెలవడం కంటే ఫిట్‌నెస్ సాధించడం చాలా ఆనందం కలిగిస్తోంది. ఇది అన్నింటికంటే విలువైనది. బాస్ వల్లే ఇది సాధ్యమైంది' అంటూ రోహిత్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. విమాన సర్వీసులకు అంతరాయం
ఈపీఎఫ్ చందాదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే వడ్డీ జమ..