బీజేపీలో చేరిన క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్
ABN , Publish Date - Nov 22 , 2026 | 07:51 AM
భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ బీజేపీలో చేరారు. జాతీయ ఓబీసీ మోర్చా కార్యవర్గ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆయన్ను పార్టీ నియమించింది.
న్యూఢిల్లీ, నవంబర్ 21(ఆంధ్రజ్యోతి): భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ బీజేపీలో చేరారు. జాతీయ ఓబీసీ మోర్చా కార్యవర్గ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆయన్ను పార్టీ నియమించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టారు. అంతకు ముందు చాహల్ బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు అమర్‌పాల్ మౌర్యతో సమావేశమయ్యారు. మరోవైపు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ పదాధికారులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఇతర బాధ్యతల నియామకాలను ప్రకటించింది. ఈ జాతీయ కమిటీలో ఏపీ, తెలంగాణలకు చెందిన నేతలకు చోటు దక్కింది. తెలంగాణకు చెందిన కడగంచి రమేష్‌ను ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శిగా నియమించారు. తెలంగాణ నుంచి భాను ప్రకాష్ ముదిరాజ్, ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీనివాసరావును జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
పారిశ్రామిక విప్లవం కంటే ఏఐ విప్లవమే పెద్దది.. ఆంథ్రోపిక్ ఐపీఓపై ట్రంప్ ప్రశంసలు..
పుతిన్ ఓ హంతకుడు.. ట్రంప్ వ్యాఖ్యలకు జెలెన్‌స్కీ కౌంటర్..