Share News

టీఎంసీ రెబల్స్‌లో యూసఫ్ పఠాన్, సాయోని ఘోష్, శత్రుఘ్నసిన్హా

ABN , Publish Date - Jun 10 , 2026 | 07:16 PM

టీఎంసీలో చెలరేగిన కల్లోలం పార్లమెంటుకు చేరడం, టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు ఇటీవల లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ ఇవ్వడం సంచలనమైంది. ఈ లేఖపై 19 మందికి పైగా సంతకాలు చేశారని, వారిలో యూసఫ్ పఠాన్, సయోని ఘోష్, శత్రుఘ్నసిన్హా తదితరులు ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం.

టీఎంసీ రెబల్స్‌లో యూసఫ్ పఠాన్, సాయోని ఘోష్, శత్రుఘ్నసిన్హా
Yusuf pathan, Saayoni Ghosh and Shatrughan sinha

న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో చెలరేగిన కల్లోలం పార్లమెంటుకు చేరడం, టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు ఇటీవల లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ ఇవ్వడం సంచలనమైంది. ఈ లేఖపై 19 మందికి పైగా సంతకాలు చేశారని, వారిలో యూసఫ్ పఠాన్ (Yusuf pathan), సాయోని ఘోష్ (Saayoni Ghosh), శత్రుఘ్నసిన్హా (Shatrughan Sinha) తదితరులు ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం. దీంతో టీఎంసీ చీలిక దిశగా సాగుతోందని చెబుతున్నారు.


సంతకాలు చేసిన వారిలో...

టీఎంసీ తిరుగుబాటు గ్రూపులో చేరనట్టు తెలుస్తున్న ఎంపీల్లో..

1.శత్రుఘ్న సిన్హా (ఆసన్‌సోల్)

2. కకోలి ఘోష్ (బరసాత్)

3. జగదీష్ చంద్ర బసునియా (కూచ్ బెహర్)

4. ఖలీ ఉర్ రెహమాన్ (జాంగిపుర్)

5. యూసఫ్ పఠాన్ (బెహ్రాంపుర్)

6. అబు తాహిర్ ఖాన్ (మధురాపుర్)

7. పార్ధ్ భౌమిక్ (బరాక్‌పోర్)

8. బాపీ హల్‌దార్ (మధురాపుర్)

9. సాయోని ఘోష్ (జాదవ్‌పుర్)

10. మాలా రాయ్ (ఘాటల్)

11. మిథిల్ బేగ్ (ఆరాం బాగ్)

12. దీపక్ అధికారి (ఘాటల్)

13. కాలీపాడా సోరేన్ (ఝాల్‌గ్రామ్)

14. జూన్ మలియా (మేదినీపుర్)

15. అరూప్ చక్రవర్తి (బంకుర)

16. షర్మలా సర్కార్ (వర్దమాన్ ఈస్ట్)

17. అసిత్ కుమార్ మాల్ (బోల్‌పుర్)

18. శతాబ్ది రాయ్ (బీర్‌భూమ్)

19. రచన బెనర్జీ (హుగ్లీ)

ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.


లోక్‌సభలో ప్రస్తుతం టీఎంసీకి 28 మంది ఎంపీలు ఉన్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం తిరుగుబాటు ఎంపీలు ఇప్పటికిప్పుడు రాజీనామా చేయడం కానీ, లాంఛనంగా బీజేపీలో చేరడం కానీ చేయకపోవచ్చని అంటున్నారు. ఇందుకు బదులుగా ఎన్డీయేకు మద్దతుగా సెపరేట్ బ్లాక్‌గా పనిచేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇందువల్ల ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉండదు.


ఇవి కూడా చదవండి..

ఆగని సంక్షోభం..టీఎంసీ రెబల్స్ గూటికి మరో ఇద్దరు లోక్‌సభ ఎంపీలు

ఖర్గే సారథ్యంలో ఏఐసీసీ అత్యవసర సమావేశం 11న

Updated Date - Jun 10 , 2026 | 07:22 PM