ప్రధాని మోదీని అభినందనలతో ముంచెత్తిన ఎన్డీయే నేతలు
ABN , Publish Date - Jun 10 , 2026 | 05:34 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎన్డీయే నేతల పెద్దఎత్తున అభినందలు తెలిపారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకోవడం, సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగిన రికార్డును మోదీ సొంత చేసుకున్న నేపథ్యంలో ఎన్డీయే నేతల సమావేశం బుధవారంనాడిక్కడ భారత్ మండపంలో జరిగింది.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎన్డీయే నేతల పెద్దఎత్తున అభినందలు తెలిపారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకోవడం, సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగిన రికార్డును మోదీ సొంత చేసుకున్న నేపథ్యంలో ఎన్డీయే నేతల సమావేశం బుధవారంనాడిక్కడ భారత్ మండపంలో జరిగింది. ప్రధాన మంత్రి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో 22 ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు, ఎన్‌డీఏ భాగస్వామ్యపక్షాల నేతలు, బీజేపీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.
మోదీ రికార్డు
భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 1964 మే 27న తుదిశ్వాస విడిచేంత వరకూ 4,398 రోజులపాటు నిరంతరాయంగా ఆ పదవిలో కొనసాగారు. ఆ రికార్డును మోదీ అధిగమించారు. 2014 మే 26న ప్రధాని పగ్గాలు చేపట్టిన ఆయన బుధవారంతో ఆ పదవిలో నిరాటంకంగా 4,399 రోజులు పూర్తిచేసుకున్నారు. తద్వారా దీర్ఘకాలం ప్రధానిగా కొనసాగిన అరుదైన రికార్డును సొంతం చేసుకునున్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రధాని పదవిలో చరిత్ర సృష్టించిన మోదీ.. మంత్రివర్గం స్టాండింగ్ ఒవేషన్, తీర్మానం
ఆగని సంక్షోభం..టీఎంసీ రెబల్స్ గూటికి మరో ఇద్దరు లోక్‌సభ ఎంపీలు