యోగి, అఖిలేష్ సహా 52 మందికి బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు.. యూపీ ఎన్నికలకు ముందు కీలక భద్రతా చర్యలు..
ABN , Publish Date - Aug 22 , 2026 | 01:45 PM
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతితో సహా మొత్తం 52 మంది నేతలకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు అందించినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకుల భద్రతను ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతితో సహా మొత్తం 52 మంది నేతలకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు అందించినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భద్రతా ఏర్పాట్లలో భాగంగానే ఈ చర్య చేపట్టినట్లు తెలిపింది (UP Election 2027).
బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు అందుకున్న వారిలో యోగి ఆదిత్యనాథ్, అఖిలేష్ యాదవ్, మాయావతితో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్నారు. మొత్తం 11 మంది రాష్ట్ర మంత్రులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. భద్రతా అవసరాల సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లను రెండు దశల్లో అందించినట్లు తెలుస్తోంది. మొదటి దశలో 8 మంది నేతలకు, రెండో దశలో మరో 44 మందికి జాకెట్లు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి (UP Leaders bulletproof jackets).
కాగా, ఈ ఒక్కో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ విలువ రూ.10 లక్షలని సమాచారం (UP leaders security). 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో భారీ బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్‌షోలు వంటి కార్యక్రమాల్లో ప్రముఖ నేతలు పెద్ద సంఖ్యలో ప్రజలను కలుసుకోనున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకుల భద్రతపై యూపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే 52 మంది నేతలకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ఇవ్వడానికి ఏదైనా నిర్దిష్ట దాడి ముప్పు లేదా ప్రత్యేక నిఘా సమాచారం కారణమా అన్నది అధికారికంగా వెల్లడించలేదు.
ఇవి కూడా చదవండి..
మనిషితో బాక్సింగ్ చేసిన చైనా రోబో.. కానీ ఆ చిన్న పని మాత్రం చేయలేకపోయింది..
మరింత పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..