Share News

అలా చేస్తే మద్దతుపై పునరాలోచిస్తాం.. విజయ్‌కు సీపీఎం వార్నింగ్

ABN , Publish Date - May 19 , 2026 | 09:00 PM

తమిళనాడులో విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వానికి తాజాగా సీపీఎం హెచ్చరిక చేసింది. అన్నాడీఎంకే‌ వర్గం ఎమ్మెల్యేల మద్దతు తీసుకువాలని టీవీకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తాము ఇంతవరకూ ఇస్తున్న మద్దతుపై పునరాలోచిస్తామని తెలిపింది.

అలా చేస్తే మద్దతుపై పునరాలోచిస్తాం.. విజయ్‌కు సీపీఎం వార్నింగ్
TVK Vijay

చెన్నై: తమిళనాడులో విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వానికి తాజాగా సీపీఎం (CPM) హెచ్చరిక చేసింది. అన్నాడీఎంకే‌ వర్గం ఎమ్మెల్యేల మద్దతు తీసుకువాలని టీవీకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తాము ఇంతవరకూ ఇస్తున్న మద్దతుపై పునరాలోచిస్తామని తెలిపింది. టీవీకే ప్రభుత్వంలో సీపీఎం భాగస్వామిగా ఉంది.


తిరుత్తురైపూండిలో మంగళవారంనాడు విలేఖరులతో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.షణ్ముగం మాట్లాడుతూ, డీఎంకే, అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని చెప్పారు. అన్నాడీఎంకేలోని ఒక వర్గం ఎమ్మెల్యేల సపోర్ట్‌ను టీవీకే తీసుకోవడం కానీ, అన్నాడీఎంకే ప్రభుత్వం కొనసాగడం కానీ ప్రజా తీర్పుకు పూర్తి విరుద్ధమని అన్నారు. స్వచ్ఛమైన పాలన అందిస్తామని టీవీకే ఇచ్చిన వాగ్దానానికి కూడా కూడా ఇలాంటి చర్యలు విరుద్ధమని అన్నారు. టీవీకే అన్నాడీఎంకేతో పొత్తుకు నిర్ణయం తీసుకోదనే తాము అనుకుంటున్నామని, ఇందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుంటే టీవీకే ప్రభుత్వానికి మద్దతు కొనసాగించడంపై పునరాలోచిస్తామని చెప్పారు.


టీవీకేకు మద్దతు ఇవ్వాలని తాము తీసుకున్న నిర్ణయాన్ని షణ్ముగం ప్రస్తావిస్తూ, తమిళనాడు మరోసారి ఎన్నికలు సిద్ధంగా లేదన్నారు. అదీకాకుండా గవర్నర్ పాలన ద్వారా దొడ్డిదారిన బీజేపీ తమిళనాడులో అడుగుపెట్టడం తమకు ఎంతమాత్రం ఇష్టం లేదన్నారు. ఆ కారణంగానే తాము టీవీకేకు మద్దతిచ్చినట్టు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

ప్రభాకరన్‌కు విజయ్ నివాళి.. రాజీవ్ గాంధీ హత్యను గుర్తుచేసిన బీజేపీ..

బీజేపీ బెదిరింపులతోనే పోటీ నుంచి తప్పుకున్న జహంగీర్ ఖాన్.. టీఎంసీ ఫైర్

Updated Date - May 19 , 2026 | 09:37 PM