Share News

ప్రభాకరన్‌కు విజయ్ నివాళి.. రాజీవ్ గాంధీ హత్యను గుర్తుచేసిన బీజేపీ..

ABN , Publish Date - May 19 , 2026 | 07:34 PM

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, నిషేధిత ఎల్‌టీటీఈ వ్యవస్థాపకుడు ప్రభాకరన్‌కు నివాళి అర్పించడం రాజకీయ వివాదానికి దారితీసింది. ప్రభాకరన్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయ్ సందేశంపై బీజేపీ విమర్శలు గుప్పించింది.

ప్రభాకరన్‌కు విజయ్ నివాళి.. రాజీవ్ గాంధీ హత్యను గుర్తుచేసిన బీజేపీ..
Vijay LTTE controversy

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, నిషేధిత ఎల్‌టీటీఈ వ్యవస్థాపకుడు ప్రభాకరన్‌కు నివాళి అర్పించడం రాజకీయ వివాదానికి దారితీసింది. ప్రభాకరన్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయ్ సందేశంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. బీజేపీ వ్యాఖ్యలకు టీవీకే పార్టీ కౌంటర్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీలంక తమిళులు మే 18వ తేదీన ప్రభాకరన్ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు (Vijay LTTE controversy).


ఈ సందర్భంగా విజయ్, శ్రీలంక తమిళులతో ఐక్యత కోరుకుంటూ, ప్రభాకరన్‌కు నివాళులర్పిస్తూ ఓ ట్వీట్ చేశారు. గతంలో కూడా విజయ్ ప్రభాకరన్‌ను తమిళులకు తల్లిలాంటి నాయకుడు అని ప్రశంసించారు. విజయ్ చర్యపై బీజేపీ విమర్శలు గుప్పించింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు ప్రభాకరన్ సంస్థ కారణమనే సంగతి తెలిసిందే. రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం టీవీకేకు తమిళనాట మిత్రపక్షంగా ఉంది (Prabhakaran tribute Vijay).


ఈ నేపథ్యంలో టీవీకేపై, కాంగ్రెస్ పార్టీపై బీజేపీ విమర్శలు గుప్పించింది (Rajiv Gandhi assassination BJP response). విజయ్ తీరును రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలకు టీవీకే కౌంటర్ ఇచ్చింది. విజయ్ నివాళులర్పించింది కేవలం ప్రభాకరన్ మరణం గురించి మాత్రమే కాదని, శ్రీలంకలో వేలాది మంది తమిళుల ఊచకోత కోసమని తెలిపింది.


ఇవి కూడా చదవండి..

గల్ఫ్ దేశాల విజ్ఞప్తితో ఇరాన్‌పై దాడి వాయిదా.. ట్రంప్ కీలక ప్రకటన


పాపం పాకిస్థాన్.. భారత్‌లో లేని ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసిందట..

Updated Date - May 19 , 2026 | 07:45 PM