Share News

యూజీసీ నెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు రేపే లాస్ట్ డేట్..

ABN , Publish Date - May 19 , 2026 | 05:01 PM

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక హెచ్చరిక జారీ చేసింది. జూన్ 2026 సెషన్‌కు సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ మే 20తో ముగియనున్నట్లు వెల్లడించింది.

యూజీసీ నెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు రేపే లాస్ట్ డేట్..
UGC NET 2026 registration

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC NET) 2026 పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక హెచ్చరిక జారీ చేసింది. జూన్ 2026 సెషన్‌కు సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ మే 20తో ముగియనున్నట్లు వెల్లడించింది. ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లై చేయాలని సూచించింది (UGC NET 2026 registration).


యూజీసీ నెట్ 2026 పరీక్షలు జూన్ 22 నుంచి 30 వరకు కంప్యూటర్- బేస్డ్ టెస్ట్ (CBT) మోడ్‌లో జరగనున్నాయి. మొత్తం 85 సబ్జెక్టులకు ఈ పరీక్ష జరుగుతుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, అలాగే పీహెచ్‌డీ అడ్మిషన్లకు ఈ పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. అభ్యర్థులు దరఖాస్తు నింపి, ఫీజు చెల్లించిన తర్వాత తప్పనిసరిగా కన్ఫర్మేషన్ పేజ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరచుకోవాలని ఎన్‌టీఏ సూచించింది. ఫీజు చెల్లింపు తర్వాత మాత్రమే దరఖాస్తు పూర్తి అయినట్లుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది (UGC NET June 2026).


ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు మే 20 చివరి తేదీ. మే 22 నుంచి మే 24 వరకు సవరణలు చేసుకునే వీలుంటుంది (NTA UGC NET application). ఈ సమయంలో అభ్యర్థులు తమ దరఖాస్తులోని వివరాలను సవరించుకునే అవకాశం ఉంటుంది. అడ్మిట్ కార్డులు జూన్ 15న విడుదలయ్యే అవకాశం ఉందని ఎన్‌టీఏ తెలిపింది. పరీక్ష కేంద్ర సమాచారం అభ్యర్థులకు జూన్ 10 నాటికి తెలుస్తుంది. అభ్యర్థులు అధికారిక UGC NET Official Website ద్వారా అప్లై చేసుకోవచ్చు.


ఇవి కూడా చదవండి..

గల్ఫ్ దేశాల విజ్ఞప్తితో ఇరాన్‌పై దాడి వాయిదా.. ట్రంప్ కీలక ప్రకటన


పాపం పాకిస్థాన్.. భారత్‌లో లేని ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసిందట..

Updated Date - May 19 , 2026 | 07:11 PM