Share News

పశ్చిమ బెంగాల్ ఎస్ఐఆర్ తుదిజాబితా విడుదల

ABN , Publish Date - Feb 28 , 2026 | 08:56 PM

పశ్చిమబెంగాల్‌‌లో ఎస్ఐఆర్ ప్రక్రియ అనంతరం ఓటర్ల తుది జాబితాను భారత ఎన్నికల కమిషన్ శనివారంనాడు విడుదల చేసింది. 2026 ఫిబ్రవరి 28వ తేదీనాటికి మొత్తం 7.04 కోట్ల మంది ఎన్నికల జాబితాలో చోటుచేసుకున్నట్టు తెలిపింది.

పశ్చిమ బెంగాల్ ఎస్ఐఆర్ తుదిజాబితా విడుదల
West Bengal

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ (West Bengal)లో ఎస్ఐఆర్ ప్రక్రియ అనంతరం ఓటర్ల తుది జాబితాను భారత ఎన్నికల కమిషన్ శనివారంనాడు విడుదల చేసింది. 2026 ఫిబ్రవరి 28వ తేదీనాటికి మొత్తం 7.04 కోట్ల మంది ఎన్నికల జాబితాలో చోటుచేసుకున్నట్టు తెలిపింది. 63.66 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించారు.


రివిజన్ ప్రక్రియలో ఓటర్లు చేర్పు, తొలగింపు అనంతరం మొత్తం ఓటర్య సంఖ్య 7.04 కోట్లుగా ఉందని చీఫ్ ఎలక్టోరల్ అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ తెలిపారు. ఫారం-7 ద్వారా 5.46 లక్షల మంది ఓటర్లను తొలగించగా, ఫారం-6, ఫారం-6ఏ సబ్మిషన్ల ద్వారా 1.82 లక్షల మందిని ఓటర్ల జాబితాలో చేర్చినట్టు చెప్పారు. రివిజన్ ప్రక్రియ పూర్తయ్యే నాటికి 58 లక్షలకు పైగా ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదని చెప్పారు.


mamata.jpg

మమతాబెనర్జీ నియోజకవర్గంలో 47,000 ఓట్ల తొలగింపు

ఎస్ఐఆర్ ప్రక్రియ అనంతరం విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నియోజవర్గమైన భవానీపూర్‌లో రాజకీయ అలజడి రేగినట్టు తెలుస్తోంది. భవనీపూర్‌ నియోజకవర్గంలో 47,000కు పైగా పేర్లను తొలగించగా, 14,000 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. గత ఏడాది నవంబర్ 4న ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి భవానీపూర్ నియోజకవర్గంలో 2,06,295 మంది ఓటర్లు ఉన్నారు.


ఇవి కూడా చదవండి..

తమిళనాడు, పుదుచ్చేరిలో మోదీ పర్యటన

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ

Updated Date - Feb 28 , 2026 | 09:02 PM