తమిళనాడు, పుదుచ్చేరిలో మోదీ పర్యటన
ABN , Publish Date - Feb 28 , 2026 | 05:25 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రాత్రి చెన్నై బయలుదేరి వెళ్తున్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలో మార్చి 1న పర్యటిస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారం రాత్రి చెన్నై బయలుదేరి వెళ్తున్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలో మార్చి 1న పర్యటిస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. మదురైలో జరిగే ఎన్డీయే ర్యాలీలో పాల్గొంటారు. తిరుప్పరకుండ్రంలోని అరుల్మిగు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు జరుపుతారు.
ప్రధానమంత్రి పర్యటన షెడ్యూల్ ప్రకారం పుదుచ్చేరిలో ఉదయం 11.45 గంటలకు పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం మదురై వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటలకు అధికారిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మోదీ పర్యటన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు 'మోదీ కమ్స్ ఎన్డీయే విన్స్' పేరుతో యాష్‌ట్యాగ్ ప్రచారం చేపట్టారు. పుదుచ్చేరి పర్యటనలో మోదీ పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. మౌలిక వసతుల కల్పన, పట్టణ సేవలు, పారిశ్రామాకాభివృద్ధి, విద్య, హెల్త్‌కేర్ పటిష్టతకు రూ.2,700 కోట్లు విలువచేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.
మదురైలో రూ.4,400 కోట్ల విలువైన మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. ఎయిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. కుంబకోణం, ఏర్కాడ్, వెల్లూరులో మూడు కొత్త ఆకాశవాణి ఎఫ్ఎం రిలో ట్రాన్సిమిటర్లను, తమిళనాడులో పునర్నిర్మాణం జరిగిన ఎనిమిది రైల్వే స్టేషన్లను ప్రారంభిస్తారు. చెన్నై బీచ్-చెన్నై ఎగ్మోర్ ఫోర్త్ లేన్‌ను జాతికి అంకింతం చేస్తారు. ఎన్డీయే ర్యాలీలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 4 గంటలకు అరుల్మిగు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.
ఇవి కూడా చదవండి..
హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ
ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు-ట్రక్కు ఢీకొని ఆరుగురి మృతి