Share News

ముహూర్తం ఫిక్స్.. మే 9న బెంగాల్‌లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం..

ABN , Publish Date - May 05 , 2026 | 11:38 AM

పశ్చిమ బెంగాల్‌లో ఘన విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రోజైన మే 9వ తేదీన బెంగాల్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ మేరకు బీజేపీ అధిష్టానం ముహూర్తం ఖరారు చేసింది.

ముహూర్తం ఫిక్స్.. మే 9న బెంగాల్‌లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం..
West Bengal government 2026

పశ్చిమ బెంగాల్‌లో ఘన విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రోజైన మే 9వ తేదీన బెంగాల్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ మేరకు బీజేపీ అధిష్టానం ముహూర్తం ఖరారు చేసింది. దీంతో సువేందు అధికారితో సహా బెంగాల్ బీజేపీ కీలక నేతలు ఢిల్లీకి పయనమైనట్టు వార్తలు వస్తున్నాయి. కాసేపట్లో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు (West Bengal government 2026).


బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో ఇంకా ఉత్కంఠ వీడలేదు (Bengal oath ceremony May 9). సీఎంగా ఎవరిని నియమించాలనే అంశంపై ఢిల్లీలో ముమ్మర కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. ఢిల్లీ భేటీ అనంతరం కోల్‌కతాలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే కొత్త ముఖ్యమంత్రి పేరును అధిష్టానం ప్రకటించబోతున్నట్టు సమాచారం.


ఇవి కూడా చదవండి..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.1.5 లక్షల మార్క్ దిగువకు బంగారం ధరలు..


కమల్ హాసన్, రజనీకాంత్‌కు సాధ్యం కానిది.. విజయ్‌కు ఎలా సాధ్యమైంది?

Updated Date - May 05 , 2026 | 11:38 AM