Share News

పబ్లిక్ లైబ్రరీల నుంచి మమత పుస్తకాలు ఔట్... బెంగాల్ సర్కార్ మరో నిర్ణయం

ABN , Publish Date - Jun 12 , 2026 | 09:20 PM

పశ్చిమబెంగాల్‌లో అధికారం కోల్పోయినప్పటి నుంచి మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆమె రాసిన పుస్తకాలను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ గ్రంథాలయాల నుంచి తొలగించాలని పశ్చిమబెంగాల్‌లోని అధికార బీజేపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.

పబ్లిక్ లైబ్రరీల నుంచి మమత పుస్తకాలు ఔట్... బెంగాల్ సర్కార్ మరో నిర్ణయం
Mamata Banerjee

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో అధికారం కోల్పోయినప్పటి నుంచి మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆమె రాసిన పుస్తకాలను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ గ్రంథాలయాల నుంచి తొలగించాలని అధికార బీజేపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. వీటిలో మమత రాసిన పాపులర్ 'ఎపాంగ్ ఒపాంగ్ ఝపాంగ్' కవితతో కూడిన సంకలనం కూడా ఉంది.


విద్యా వికాశం, జాతీయవాద భావాలకు దోహదపడే పుస్తకాలను మాత్రమే లైబ్రరీలో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. రబీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద వంటి ప్రముఖ వ్యక్తుల పుస్తకాలు మాత్రమే ఇకనుంచి లైబ్రరీల్లో ఉంటాయన్నారు. మమతా బెనర్జీ రాసిన 90 పుస్తకాలను కొనుగోలు చేయాలంటూ 2025లో టీఎంసీ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగా, బీజేపీ సర్కార్ తాజా నిర్ణయంతో ఆ ఆదేశాలు రద్దయ్యాయి.


దీనిపై పశ్చిమబెంగాల్ మంత్రి గౌరీ శంకర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం నియంతృత్వ ధోరణలో వ్యవహరించిందని, ఆకారణంగానే అన్ని లైబ్రరీల్లో మమతా బెనర్జీ రాసిన పుస్తకాలు వచ్చిచేరాయని అన్నారు. అనవసరమైన పుస్తకాలన్నింటినీ లైబ్రరీల నంచి తొలగించాలని కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.


మమతా బెనర్జీ రాజకీయ నాయకురాలే కాకుండా కవియిత్రిగా కూడా అనేక పుస్తకాలు, కవితాలు, కవితా సంకలనాలు రాశారు. ఇంతవరకూ 150కి పైగా పుస్తకాలు రాశారు. అనేక పుస్తకాలు ఆంగ్లం, ఉర్దూ, ఇతర భాషల్లో అనువాదం కూడా అయ్యాయి.


ఇవి కూడా చదవండి..

నా అంత చెడ్డవాడు ఉండడు... సీఎం సువేందు అధికారి హెచ్చరిక

‘అభిషేక్ నా లీడర్ కాదు.. దీదీ కోసమే నా పోరాటం’: శత్రుఘ్న సిన్హా

Updated Date - Jun 12 , 2026 | 09:23 PM