నా అంత చెడ్డవాడు ఉండడు... సీఎం సువేందు అధికారి హెచ్చరిక
ABN , Publish Date - Jun 12 , 2026 | 08:32 PM
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ విధ్వంసం, హింస, పోలీసులపై దాడులకు పాల్పడేవారికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి గట్టి హెచ్చరిక చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఆటంకం కలిగించే ఏ ఒక్కరినీ విడిచిపెట్టేది లేదని, కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు.
కోల్‌కతా: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ విధ్వంసం, హింస, పోలీసులపై దాడులకు పాల్పడేవారికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి (Suvendu Adhikari) గట్టి హెచ్చరిక చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఆటంకం కలిగించే ఏ ఒక్కరినీ విడిచిపెట్టేది లేదని, కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. అలాంటి ఘటనలు పునరావృతమైతే తనకంటే చెడ్డవాడు ఎవరూ ఉండరని హెచ్చరించారు.
నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న తరుణంలో రాష్ట్ర బీజేపీ ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ, తమ ప్రభుత్వ ప్రాధాన్యతా క్రమాల్లో శాంతిభద్రతల పరిరక్షణ అత్యంత కీలకమని చెప్పారు. సంఘ విద్రోహ శక్తులను ప్రభుత్వం అనుమతించే ప్రసక్తేలేదని, విధ్వంసకాండకు పాల్పడినా, చట్టాన్ని సవాలు చేసినా తీవ్ర పరిణామాలు తప్పవని అన్నారు. అలాంటి ఘటనలు పునరావృతమైతే తనకంటే చెడ్డవాడు ఉండడని హెచ్చరించారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయని, వాటి వ్యవహారంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. పార్క్ సర్కస్, ఆసన్‌సోల్‌లో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నా మొత్తంగా చూస్తే శాంతిభద్రతల పరిస్థితి చాలామటుకు అదుపులోనే ఉందన్నారు. మోదీ నాయకత్వం, గైడెన్స్‌లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం స్వల్ప వ్యవధిలోనే కొన్ని పనులు పూర్తి చేసిందని అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వ ప్రయోజనాలు ఇప్పటికే ప్రజలకు అందడం మొదలైందని, రాబోయే రోజుల్లో ప్రజలకు మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు. సరిహద్దుల్లో బోర్టర్ మేనేజిమెంట్, సెక్యూరిటీ ప్రాజెక్టుల కోసం బీఎస్ఎఫ్‌కు భూములు అప్పగించామని, ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. చికెన్ నెక్ కారిడార్‌కు ఆనుకున్న ప్రాంతాల్లో ఫెన్సింగ్ పనులు మొదలయ్యాయని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
మాదే అసలైన టీఎంసీ.. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను కలవనున్న రెబల్స్
మోహన్ భాగవత్ ప్రయాణిస్తున్న రైలుపై దాడి.. ఇద్దరి అరెస్టు