Share News

మాదే అసలైన టీఎంసీ.. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను కలవనున్న రెబల్స్

ABN , Publish Date - Jun 12 , 2026 | 07:06 PM

తృణమూల్ కాంగ్రెస్‌‌లో తలెత్తిన సంక్షోభం పతాక స్థాయికి చేరుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో రగులుతున్న తిరుగుబాటు ఎంపీలు తమదే 'నిజమైన టీఎంసీ' పార్లమెంటరీ గ్రూప్‌ అని క్లెయిమ్ చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.

మాదే అసలైన టీఎంసీ.. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను కలవనున్న రెబల్స్
Mamata Banerjee

న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్‌ (TMC)లో తలెత్తిన సంక్షోభం పతాక స్థాయికి చేరుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో రగులుతున్న తిరుగుబాటు ఎంపీలు తమదే 'నిజమైన టీఎంసీ' పార్లమెంటరీ గ్రూప్‌ అని క్లెయిమ్ చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలుసుకోనున్నారు. ఈ విషయాన్ని రెబల్ ఎంపీ జగదీష్ చంద్ర బర్మా బసునియా ధ్రువీకరించారు. ఇప్పటికే తమ గ్రూపు స్పీకర్‌కు ఒక రిప్రజెంటేషన్ సమర్పించిందని, తమను 'రియల్ టీఎంసీ' పార్లమెంటు గ్రూపు‌గా గుర్తించాలని కోరేందుకు ఈనెల 15న మరోసారి కలుసుకోనున్నామని రెబల్ ఎంపీ జగదీష్ చంద్ర బర్మా బసునియా తెలిపారు.


ప్రత్యేక పార్లమెంటరీ గ్రూపు ఏర్పాటుకు, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకు మద్దతించేందుకు రెబల్ ఎంపీలు పట్టుదలగా ఉండగా, వారికి మద్దతిస్తున్న వారిలో బసునియా ఉన్నారు. ఆయన కూచ్ బెహర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీ ఎంపీలను ఫిరాయింపులకు కొందరు ప్రోత్సహిస్తున్నారంటూ టీఎంసీ ఎంపీ కీర్తి అజాద్ చేసిన ఆరోపణలను బసునియా తోసిపుచ్చారు. ఆయన అబద్ధలాకోరు అనీ, ఆ విధంగా చెప్పడం సరికాదని అన్నారు. తాము 19 మంది ఎంపీలమనీ, ఆయన కూడా ఒక ఎంపీయేనని, ఇలాంటి ఆరోపణలు చేయడం మంచిదికాదని చెప్పారు.


తిరుగుబాటు ఎంపీలకు కకోలీ ఘోష్ దస్తిదార్ నాయకత్వం వహిస్తున్నారు. లోక్‌సభలోని 20 మంది టీఎంసీ ఎంపీలు ఎన్డీయేకు మద్దతిస్తున్నట్టుగా ఆమె ఇటీవల ప్రకటించారు. ఈ గ్రూపులో శతాబ్దీ రాయ్, యూసుఫ్ పఠాన్, సయోనీ ఘోష్, శత్రుఘ్నసిన్హా తదితర ఎంపీలు ఉన్నారు.


ఇవి కూడా చదవండి..

అమేథీ పంచాయతీ ఓటర్ల జాబితా నుండి స్మృతి ఇరానీ పేరు గల్లంతు

మోహన్ భాగవత్ ప్రయాణిస్తున్న రైలుపై దాడి.. ఇద్దరి అరెస్టు

Updated Date - Jun 12 , 2026 | 08:27 PM