Share News

నీటి కోసం గొడవ.. ఒకరి మృతి, ఇళ్లకు నిప్పు..

ABN , Publish Date - Jun 14 , 2026 | 04:36 PM

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ జిల్లాలో నీటి వినియోగంపై ప్రారంభమైన వివాదం తీవ్ర హింసకు దారితీసింది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

నీటి కోసం గొడవ.. ఒకరి మృతి, ఇళ్లకు నిప్పు..
Uttarakhand violence

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ జిల్లాలో నీటి వినియోగంపై ప్రారంభమైన వివాదం తీవ్ర హింసకు దారితీసింది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పొలాలకు నీటి సరఫరా విషయంలో శనివారం సాయంత్రం మొదలైన వాగ్వాదం హింసాత్మక ఘర్షణకు దారితీసింది (Uttarakhand violence).


పక్క పొలం నుంచి తన పొలంలోకి నీరు పెట్టుకున్నాడనే కోపంతో ఈ ఘర్షణ మొదలైంది. కొందరు వ్యక్తులు లాఠీలు, సుత్తులు, పారలతో ఆ నీరు పెట్టుకున్న వ్యక్తి ఇంటికి చేరుకున్నారు. బలవంతంగా ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడ్డారు. ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, అతడి ఇద్దరు సోదరులు, వదిన తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని బీజేపీ యువ మోర్చా ఓబీసీ విభాగానికి చెందిన సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా గుర్తించారు. మృతుడి దహనక్రియలు పూర్తయిన తర్వాత ప్రతీకార హింస చోటు చేసుకుంది (Dehradun clash).


మృతుడి స్నేహితులు, బంధువులు నిందితుల నివాసాలపై రాళ్లు రువ్వారు (House set on fire). ఒక ఇంటికి నిప్పు పెట్టారు. అనంతరం, అధికారులు నిందితులలో ఒకరైన అమన్ అలీ నివాసాన్ని బుల్డోజర్‌తో కూల్చివేశారు. దీంతో గ్రామ ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. ఇళ్లకు నిప్పంటించుకున్నారు. ఉద్రిక్తతలు తీవ్రంగా పెరగడంతో గ్రామంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్టు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

ఐదేళ్లుగా విడాకుల కోసం పోరాటం.. చివరకు కోర్టులో న్యాయూమర్తి ఎదుట కౌగిలించుకుని..


మరింత ఎక్కువగా రష్యా చమురు.. మేలో గణనీయంగా పెరిగిన దిగుమతులు..

Updated Date - Jun 14 , 2026 | 04:52 PM