ఐదేళ్లుగా విడాకుల కోసం పోరాటం.. చివరకు కోర్టులో న్యాయూమర్తి ఎదుట కౌగిలించుకుని..
ABN , Publish Date - Jun 14 , 2026 | 03:26 PM
వారిద్దరూ విడాకులు తీసుకోవాలనుకున్నారు.. ఐదేళ్లుగా విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారు.. చివరకు విడాకులు వచ్చే సమయానికి ఒకరినొకరు అర్థం చేసుకున్నారు.. కోర్టులో న్యాయమూర్తి ఎదుటే కౌగిలించుకుని సినిమా స్టైల్లో కలిసిపోయారు..
వారిద్దరూ విడాకులు తీసుకోవాలనుకున్నారు.. ఐదేళ్లుగా విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారు.. చివరకు విడాకులు వచ్చే సమయానికి ఒకరినొకరు అర్థం చేసుకున్నారు.. కోర్టులో న్యాయమూర్తి ఎదుటే కౌగిలించుకుని సినిమా స్టైల్లో కలిసిపోయారు.. ఈ దంపతుల కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది (Couple reunion in court).
ఢిల్లీకి చెందిన సౌరభ్‌కు 2020లో శిఖ అనే యువతితో వివాహం జరిగింది. వివాహమైన కొద్ది రోజులకే వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుని ఐదేళ్లుగా ఫ్యామిలీ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఈ బాధతో ఇటీవల శిఖ తండ్రికి గుండెపోటు వచ్చింది. ఉన్న డబ్బంతా కోర్టు ఖర్చుల కోసం కరిగిపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్‌లో చూపించలేక ఆయణ్ని ప్రభుత్వ హాస్పిటల్‌లో చేర్పించారు. విషయం తెలుసుకున్న సౌరభ్.. శిఖ తండ్రిని గురుగ్రామ్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్చి డబ్బు కట్టారు (Emotional courtroom reunion).
ఆ హాస్పిటల్‌లో మెరుగైన వైద్యం అందడంతో శిఖ తండ్రి తిరిగి కోలుకున్నారు (Divorce case India). ఇక, విడాకుల విచారణ నిమిత్తం సౌరభ్, శిఖ తాజాగా కోర్టు ముందు హాజరయ్యారు. 'మీరు ఇప్పటికీ విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా' అని న్యాయమూర్తి వారిని ప్రశ్నించారు. శిఖ తన వద్ద ఉన్న విడాకుల పత్రాలను చించేసి భర్తను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది. తాము విడిపోవాలనుకోవడం లేదని, కలిసే ఉంటామని వారిద్దరూ న్యాయమూర్తికి చెప్పడంతో కథ సుఖాంతమైంది.
ఈ వార్తలనూ చదవండి:
ఏంటీ.. మస్క్ ఇంత చిన్న ఇంట్లో ఉంటారా?
జడ్జి సీటులో కూర్చున్న మహిళ! ఆర్డర్.. ఆర్డర్.. అంటూ