విజయ్ టీవీకేకు మద్దతు.. కాంగ్రెస్ కీలక నిర్ణయం
ABN , Publish Date - May 05 , 2026 | 09:49 PM
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు కోసం టీవీకేకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని సమావేశానంతరం మీడియాకు కేసీ వేణుగోపాల్ తెలిపారు.
చెన్నై: తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్ సారథ్యంలోని టీవీకేకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో పార్టీ ముఖ్యనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్ మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు కోసం టీవీకేకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని సమావేశానంతరం మీడియాకు కేసీ వేణుగోపాల్ తెలిపారు.
ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని విజయ్ కోరారని వేణుగోపాల్ తెలిపారు. తమిళనాడు ప్రజలు బీజేపీని కోరుకోలేదని, లౌకక ప్రభుత్వ ఏర్పాటు, రాజ్యాంగ పరిరక్షణ కోసం తమిళనాడు ప్రజలు తీర్పునిచ్చారని ఆయన చెప్పారు. టీవీకే విజ్ఞప్తి మేరకు తగిన నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు కాంగ్రెస్ యూనిట్‌కు తెలియజేశామని అన్నారు. తమిళనాడు యూనిట్ గురువారం ఉదయం సమావేశమవుతుందని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం 7న