Share News

రాజీనామా చేయనంటే.. డిస్మిస్సే

ABN , Publish Date - May 05 , 2026 | 07:29 PM

పశ్చిమబెంగాల్‌లో తాను ఓడిపోలేదని, రాజీనామా చేసేది లేదని టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ చేసిన వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. 'అప్పుడు ఒకటే మార్గం ఉంటుంది. డిస్మిస్ చేయడమే' అని ఆయన అన్నారు.

రాజీనామా చేయనంటే.. డిస్మిస్సే
Himanta Biswa Sharma and Mamata Banerjee

గువాహటి: పశ్చిమబెంగాల్‌లో తాను ఓడిపోలేదని, రాజీనామా చేసేది లేదని టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ చేసిన వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sharma) స్పందించారు. 'అప్పుడు ఒకటే మార్గం ఉంటుంది. డిస్మిస్ చేయడమే' అని ఒక ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. చాలా కాలంగా ఆమెను ప్రజలు భరిస్తూ వచ్చారని వ్యాఖ్యానించారు.


మూడుసార్లు అధికారంలో కొనసాగిన మమతా బెనర్జీ తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మంగళవారంనాడు మీడియా సమావేశంలో ఘాటుగా స్పందించారు. బెంగాల్‌లో తాను బీజేపీతో పోరాడలేదని, ఆ పార్టీ కోసం పనిచేసిన ఎన్నికల సంఘంతో పోరాడానని, తన జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని అన్నారు. ప్రధాని ఎన్నికల కమిషనర్‌ను 'విలన్'గా పేర్కొన్నారు. ఎన్నికల సంఘంతో కలిసి బీజేపీ గేమ్ ఆడిందని, 100 స్థానాలను బీజేపీ లూటీ చేసిందని అన్నారు. ఇది తమ ఓటమి కాదని, అందువల్ల రాజీనామా చేయనని, రాజ్‌భవన్‌కు వెళ్లనని చెప్పారు.


మమతాబెనర్జీ రాజీనామాకు నిరాకరిస్తే రాష్ట్రపతి పాలన అమల్లోకి తెచ్చే అవకాశాలుండవచ్చని వినిపిస్తుండగా, ఆ అవసరం లేదని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల గడువు ముగియడానికి ముందే గెలిచిన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానిస్తే చాలని పేర్కొన్నాయి. పశ్చిమబెంగాల్ ప్రస్తుత అసెంబ్లీ గడువు మే 7తో ముగియనుంది. అయితే రెండ్రోజుల తర్వాత మే 9న కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి బీజేపీ సన్నాహాలు చేస్తోంది.


ఇవి కూడా చదవండి..

కేంద్ర ఎన్నికల సంఘమే ప్రధాన విలన్.. మమతా బెనర్జీ

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం 7న

Updated Date - May 05 , 2026 | 07:47 PM