టీవీకే లెజిస్లేచర్ పార్టీ నేతగా విజయ్ ఎన్నిక
ABN , Publish Date - May 05 , 2026 | 03:35 PM
తమిళగ వెట్రి కళగం శాసనసభాపక్ష నేతగా పార్టీ అధినేత విజయ్ మంగళవారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులతో టీవీకే కార్యాలయంలో విజయ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో లెజిస్లేటివ్ పార్టీ నేతగా విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
చెన్నై: తమిళగ వెట్రి కళగం (TVK) శాసనసభాపక్ష నేత (Legislativ Party Leader)గా ఆ పార్టీ అధినేత విజయ్ (Vijay) మంగళవారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులతో టీవీకే కార్యాలయంలో విజయ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో లెజిస్లేటివ్ పార్టీ నేతగా విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమైంది.
టీవీకే తమిళనాడులో అనూహ్య విజయం సాధించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లను దక్కించుకోలేకపోయింది. దీంతో పార్టీకి అవసరమైన సీట్లను కూడగట్టే విషయంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగిట్టు చెబుతున్నాయి. మద్దతు కూడగట్టే వ్యవహారంలో దూకుడుగా వ్యవహరించరాదని, ఏ రాజకీయ పార్టీని బతిమాలే విధంగా ఉండకూడదని టీవీకే నేతలు ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించింది. మెజారిటీకి మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. టీవీకే సారథ్యంలోని ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉందని తెలుస్తోంది. రెండు మంత్రి పదవులను కాంగ్రెస్ ఆశిస్తోందని, వామపక్ష పార్టీలు సైతం టీవీకే నేతలతో సంప్రదింపులు సాగిస్తున్నాయని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-5, వీసీకే-2, సీపీఐ-2, సీపీఎం-2 సీట్లు గెలుచుకున్నాయి. ఐయూఎంఎల్, డీఎండీకే, పీఎంకే పార్టీలను నుంచి కూడా టీవీకేకు మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
బెంగాల్‌కు బీజేపీ కేంద్ర పరిశీలకుడిగా అమిత్‌షా, అస్సాంకు జేపీ నడ్డా
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన విజయ్..